ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

12, నవంబర్ 2010, శుక్రవారం

సరస సల్లాపము - 9’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ అవసాన దశలో హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళో, రేపో అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఆయన కాత్మీయుడయిన ఒక శిష్యుడు పరామర్శించడానికి వెళ్ళాడు. ఏదో రకంగా ధైర్యం చెప్పాలి కాబట్టి, ఆ శిష్యుడు గురువుగారితో " డాక్టరు గారితో మాట్లాడాను ... ఏం భయం లేదన్నారు " అన్నాడు. వెంటనే విశ్వనాథ వారన్న మాట - " వాడి బొంద! వాడికేం భయం? పోతే ... నేను పోతాను."
పక్కనే ఉన్న నర్సు కిసిక్కుమంది.