28, మే 2014, బుధవారం

నండూరి రామకృష్ణమాచార్యులు గారి 94వ జయంతిమహోత్సవం

    



మహాకవి కీ.శేనండూరి రామకృష్ణమాచార్యులు గారి 94 జయంతిమహోత్సవం 29 ఏప్రిల్ 2014 నాడు హైదరాబాద్ సుల్తాన్ బజారులోనిశ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో వైభవంగా జరిగింది."నండూరిరామకృష్ణమాచార్య సాహిత్య పీఠంమరియు "నవ్యసాహితీ సమితి"సమ్యుక్తాధ్వర్యంలో నిర్వహింపబడిన  కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయంవిశ్రాంత ఆచార్యులుప్రముఖ కవి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారికి"నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్యకవితా పురస్కారంప్రదానం చేయబడిందిఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులుఆర్ష ధర్మ ప్రచారకులు,సాహితీవేత్త  ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అధ్యక్షత వహించిన  సభలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిసాహితీమూర్తి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం పక్షాన, పురస్కార ప్రదానంచేసి ప్రసంగించారు.సమర్థులైన ఒక సాహితీదిగ్గజానికి  పురస్కారాన్ని ప్రదానం చేయడం ఎంతో సముచితంగా ఉందని ఆయనప్రశంసించారుఅటు నండూరి వారిలోఇటు కోవెల వారిలో సమ స్థాయిలో దేశభక్తి,జాతీయతాభిమానంతాత్త్విక దృక్పథంతో బాటుఆధునిక అభ్యుదయ భావాలుప్రస్ఫుటంగా దర్శనమిస్తాయని వక్తలు వివరించారు.
 సభలో డారాపాక ఏకాంబరాచార్య గారుడామంగళగిరి ప్రమీల గారుశ్రీఆత్మకూరి గాంధీ గారుపీఠం అధ్యక్షులు శ్రీ కేసాగరరావు గారుకార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర గారితో బాటు శ్రీ గోవిందరాజులు గారుడావిద్యారణ్య గారునండూరివారి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.    
కోవెల వారి స్పందనతో ముగిసిన  సభాకార్యక్రమానికి ముందు, ప్రముఖగాయకులు శ్రీ అమలాపురం   కన్నారావు గారు నండూరి వారి కలం నుండిజాలువారిన కమనీయ పద్యాలను మధురంగా ఆలపించి అలరించారు.        
                                                         ***