"సందేశ దీపిక" - నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి
10, డిసెంబర్ 2013, మంగళవారం
సాహితీప్రియులకు సాదరాహ్వానం
గురువారం 12 డిసంబర్ 2013 నాడు సాయంత్రం హైదరాబాదులో చిక్కడపల్లి,అశోక్ నగర్ లో ఉన్న 'త్యాగరాయ గాన సభాలో 'ప్రముఖ సాహితీమూర్తి కీ.శే. వేమరాజు నరసింహారావు స్మారక సాహితీ పురస్కారం', ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారికి ప్రదానం చేయబడుతుంది. 'నవ్య సాహితీ సమితి' నిర్వహించే ఈ కార్యక్రమంలో మా సాహితీ మిత్రుల బృందం అంతా కలసి "భువన విజయం" సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నాం.
11, జులై 2013, గురువారం
సాహిత్యాభిమానులకు స్వాగతం
"వి.ఎల్.ఎస్. విజ్ఞాన సారస్వత పీఠం" 8వ వార్షికోత్సవ సందర్భంగా "పద్యకవితా పురస్కార ప్రదానోత్సవం" మరియు "గ్రంథావిష్కరణోత్సవం" కార్యక్రమాల సభ ఆదివారం 14 జూలై 2013 నాడు సాయంత్రం 6 గం||లకు హైదరాబాద్ లోని "రవీంద్ర భారతి" సమావేశ మందిరంలో నిర్వహించబడుతోంది.
సాహిత్యాభిమానులందరికీ ఇదే మా సాదర స్వాగతం!
- డా. ఆచార్య ఫణీంద్ర
పురస్కార గ్రహీతలు :
1. ప్రముఖ కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు
2. ప్రముఖ కవి, అష్టావధాని శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారు
ఆవిష్కరింపబడనున్న "ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం" గారి గ్రంథాలు :
1. "ఆత్మీయ కవితా కదంబం" (విస్తృతీకృత ద్వితీయ ముద్రణ)
2. "How Sweet Is Thy Name Rama!" ("శ్రీరామ! నీ నామ మేమి రుచిరా!" పద్య కావ్యానికి ఆంగ్లానువాదం)
సాహిత్యాభిమానులందరికీ ఇదే మా సాదర స్వాగతం!
- డా. ఆచార్య ఫణీంద్ర
సాహిత్య సలహాదారు
వి.ఎల్.ఎస్. విజ్ఞాన సారస్వత పీఠం
30, జూన్ 2013, ఆదివారం
25, జూన్ 2013, మంగళవారం
16, జూన్ 2013, ఆదివారం
1, మే 2013, బుధవారం
మా గురువు గారి 93వ జయంతి సభ
నిన్న ( 29 ఏప్రిల్ 2013) సాయంత్రం ’రవీంద్ర భారతి’ సమావేశ మందిరంలో
మా గురువు గారు దివంగత మహాకవి డా. నండూరి రామ కృష్ణమాచార్యుల వారి 93వ జయంతి సభ క్రిక్కిరిసిన సాహిత్యాభిమానుల సమక్షంలో ఎంతో వైభవోపేతంగా, రమణీయంగా జరిగి పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని పరవశింప జేసింది. ఆ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను, ఆ కార్యక్రమ వివరాలను తెలియజేసే వివిధ తెలుగు వార్తా పత్రికలలో వచ్చిన వార్తా విశేషాలను వీక్షించి ఆనందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర
ఆహ్వాన పత్రిక :
నమస్తే తెలంగాణ :
వార్త :
ఆంధ్ర జ్యోతి :
సూర్య :
2, మార్చి 2013, శనివారం
ఢిల్లీలో "వేటూరి ప్రభాకర శాస్త్రి" జయంతి
దేశ రాజధాని ఢిల్లీలోని "ఏ.పి.భవన్" లో 9 మార్చ్ 2013 నాడు, తెలుగు సాహితీ దిగ్గజం కీ||శే|| వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 125వ జయంతి నిర్వహిస్తున్నట్టు సాహితీ మిత్రులు శ్రీ పత్తిపాక మోహన్ తెలియజేసారు.
ఢిల్లీ వాసులైన తెలుగు వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి.
- డా. ఆచార్య ఫణీంద్ర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
















