9, డిసెంబర్ 2014, మంగళవారం

వేమరాజు నరసింహారావు సాహిత్య పురస్కారం

12 డిసెంబర్ 2014 సాయంత్రం 6 గం||లకు "రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్"లో  స్వర్గీయ వేమరాజు నరసింహారావు స్మారక సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహించబడుతుంది. ఈ సభానంతరం బాలలచే "భువన విజయం" సాహిత్య రూపకం ప్రదర్శించబడుతుంది. సాహిత్యాభిమానులకు ఇదే మా ఆహ్వానం.

- డా. ఆచార్య ఫణీంద్ర



5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అస్మద్గురు సంస్మరణ ...

గురు పూజా దినోత్సవ సందర్భంగా ..

అస్మద్గురు సంస్మరణ ...


- డా. ఆచార్య ఫణీంద్ర 

28, మే 2014, బుధవారం

నండూరి రామకృష్ణమాచార్యులు గారి 94వ జయంతిమహోత్సవం

    



మహాకవి కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యులు గారి 94వ జయంతిమహోత్సవం 29 ఏప్రిల్ 2014 నాడు హైదరాబాద్ సుల్తాన్ బజారులోనిశ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో వైభవంగా జరిగింది."నండూరిరామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" మరియు "నవ్యసాహితీ సమితి"సమ్యుక్తాధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయంవిశ్రాంత ఆచార్యులు, ప్రముఖ కవి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారికి"నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్యకవితా పురస్కారం" ప్రదానం చేయబడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, ఆర్ష ధర్మ ప్రచారకులు,సాహితీవేత్త  ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అధ్యక్షత వహించిన ఈ సభలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి, సాహితీమూర్తి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం"  పక్షాన, పురస్కార ప్రదానంచేసి ప్రసంగించారు.సమర్థులైన ఒక సాహితీదిగ్గజానికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ఎంతో సముచితంగా ఉందని ఆయనప్రశంసించారు. అటు నండూరి వారిలో, ఇటు కోవెల వారిలో సమ స్థాయిలో దేశభక్తి,జాతీయతాభిమానం, తాత్త్విక దృక్పథంతో బాటు, ఆధునిక అభ్యుదయ భావాలుప్రస్ఫుటంగా దర్శనమిస్తాయని వక్తలు వివరించారు.
ఈ సభలో డా. రాపాక ఏకాంబరాచార్య గారు, డా. మంగళగిరి ప్రమీల గారు, శ్రీఆత్మకూరి గాంధీ గారు, పీఠం అధ్యక్షులు శ్రీ కే. సాగరరావు గారు, కార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర గారితో బాటు శ్రీ గోవిందరాజులు గారు, డా. విద్యారణ్య గారు, నండూరివారి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.    
కోవెల వారి స్పందనతో ముగిసిన ఈ సభాకార్యక్రమానికి ముందు, ప్రముఖగాయకులు శ్రీ అమలాపురం   కన్నారావు గారు నండూరి వారి కలం నుండిజాలువారిన కమనీయ పద్యాలను మధురంగా ఆలపించి అలరించారు.        
                                                         ***   

29, ఏప్రిల్ 2014, మంగళవారం

జంట నగరాలలోని సాహిత్యాభిమానులారా !

జంట నగరాలలోని సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం

- డా. ఆచార్య ఫణీంద్ర


20, ఏప్రిల్ 2014, ఆదివారం

సరస సల్లాపం - 26

చాలా కాలం క్రితం నాటి మాట!

మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారికి కేంద్ర ప్రభుత్వం 'పద్మ విభూషణ్' పురస్కారాన్ని ప్రకటించింది. విజయవాడలో ఆయనకు అభిమానులు ఘనమైన సన్మాన సభను ఏర్పాటు చేసారు.
ఆయనతో సిద్ధాంతపరమైన వైరుధ్యాలున్న శ్రీశ్రీ గారు ఆయనపై గల వ్యక్తిగత గౌరవంతో ఆ సభకు వెళ్ళారు. అయితే చాలా మంది సంప్రదాయవాద కవులున్న ఆ సభలో ఆయన చివరి వరుస కుర్చీలలో ఒక మూల కూర్చున్నారు.

సభాప్రారంభ సమయానికి విచ్చేసిన విశ్వనాథ వారు వేదిక పైకి వెళ్ళే మెట్ల నెక్కబోతూ ఆగి, సభాసదులందరినీ ఒక్కసారి పరికించారు. దూరంగా చివరి వరుసలో కూర్చున్న శ్రీశ్రీ గారిని చూసిన విశ్వనాథ వారు ఆయనతో - "శ్రీశ్రీ! ఇలా రా!" అని పిలిచారు. శ్రీశ్రీ గారు తప్పదన్నట్టుగా వెళ్ళి ఆయన ముందు నిలుచున్నారు. విశ్వనాథ వారు ఆయనతో - "నాకు 'పద్మవిభూషణ్' పురస్కారం ఇచ్చారు ... వచ్చి కలసి అభినందించవలసిన అవసరం లేదా?" అని ప్రశ్నించారు. దానికి శ్రీశ్రీ వెంటనే - "లేదండి! ఏకంగా 'భారత రత్న' వచ్చాక కలసి అభినందిద్దామనుకొన్నాను." అని సమాధానమిచ్చారు. విశ్వనాథ వారు ఇక మరోమాట లేక, నవ్వుతూ వేదిక పైకి ప్రస్థానించారు.