చాలా కాలం క్రితం నాటి మాట!
మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారికి కేంద్ర ప్రభుత్వం 'పద్మ విభూషణ్' పురస్కారాన్ని ప్రకటించింది. విజయవాడలో ఆయనకు అభిమానులు ఘనమైన సన్మాన సభను ఏర్పాటు చేసారు.
ఆయనతో సిద్ధాంతపరమైన వైరుధ్యాలున్న శ్రీశ్రీ గారు ఆయనపై గల వ్యక్తిగత గౌరవంతో ఆ సభకు వెళ్ళారు. అయితే చాలా మంది సంప్రదాయవాద కవులున్న ఆ సభలో ఆయన చివరి వరుస కుర్చీలలో ఒక మూల కూర్చున్నారు.
సభాప్రారంభ సమయానికి విచ్చేసిన విశ్వనాథ వారు వేదిక పైకి వెళ్ళే మెట్ల నెక్కబోతూ ఆగి, సభాసదులందరినీ ఒక్కసారి పరికించారు. దూరంగా చివరి వరుసలో కూర్చున్న శ్రీశ్రీ గారిని చూసిన విశ్వనాథ వారు ఆయనతో - "శ్రీశ్రీ! ఇలా రా!" అని పిలిచారు. శ్రీశ్రీ గారు తప్పదన్నట్టుగా వెళ్ళి ఆయన ముందు నిలుచున్నారు. విశ్వనాథ వారు ఆయనతో - "నాకు 'పద్మవిభూషణ్' పురస్కారం ఇచ్చారు ... వచ్చి కలసి అభినందించవలసిన అవసరం లేదా?" అని ప్రశ్నించారు. దానికి శ్రీశ్రీ వెంటనే - "లేదండి! ఏకంగా 'భారత రత్న' వచ్చాక కలసి అభినందిద్దామనుకొన్నాను." అని సమాధానమిచ్చారు. విశ్వనాథ వారు ఇక మరోమాట లేక, నవ్వుతూ వేదిక పైకి ప్రస్థానించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి