1, డిసెంబర్ 2016, గురువారం

"శ్రీమదాంధ్ర శివానంద రామాయణము " కావ్యావిష్కరణ సభ



















ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు రచించిన "శ్రీమదాంధ్ర శివానంద రామాయణము (బాలకాండం)" కావ్యావిష్కరణ సభలో గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి గారు.
చిత్రంలో .. ఎడమ నుండి .. డా. ఆచార్య ఫణీంద్ర (నేను), ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, డా.జి.యం. రామశర్మ గారు, డా. రాపాక ఏకాంబరాచారి గారు, ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు, ఆచార్య పొన్నపల్లి వెంకట కృష్ణయ్య గారు మరియు చిలకమర్రి కృష్ణమాచార్యులు గారు ఉన్నారు.

22, నవంబర్ 2016, మంగళవారం

"శ్రీమదాంధ్ర శివానంద రామాయణము (బాల కాండము)" కావ్యావిష్కరణ

ప్రముఖ పద్యకవి ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు రచించిన "శ్రీమదాంధ్ర శివానంద రామాయణము (బాల కాండము)" కావ్యావిష్కరణ మహాసభకు సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానము.

- డా. ఆచార్య ఫణీంద్ర


27, ఆగస్టు 2016, శనివారం

కృష్ణా పుష్కర నీరాజనం

"ఓమ్ స్పిరిచ్యువల్" మాస పత్రిక - కృష్ణా పుష్కరాల ప్రత్యేక సంచికలో ...


22, జులై 2016, శుక్రవారం

చంద్రం గారి చక్కని పద్య కవిత

ఒక పత్రికలో గుడివాడకు చెందిన "హెచ్. ఆర్. చంద్రం" గారు రచించిన ఈ పద్యకవిత నన్ను బాగా ఆకట్టుకొంది. వస్తు నవ్యతతో సహజంగా, హృద్యంగా సాగిన ఈ పద్య కవితను ఆధునిక పద్య కవితాభిమానులు ఆస్వాదించి ఆనందిస్తారని భావిస్తూ ఇక్కడ ప్రచురిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

9, జూన్ 2016, గురువారం

వైభవంగా పురస్కారాల ప్రదానం

ప్రముఖ కవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన వి.యల్.యస్. విజ్ఞాన సారస్వత పీఠం - హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో 8 జూన్ 2016 నాడు "వేము అన్నపూర్ణ జ్ఞాపక పద్యకవితా పురస్కారాల ప్రదానోత్సవం" నిర్వహించింది. ప్రముఖ రచయిత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీమతి మలయవాసిని గారికి మరియు ప్రముఖ కవి, బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీ రావికంటి వసునందన్ గారికి ఈ పురస్కారాలను ప్రదానం చేసారు. ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న నేను ఆచార్య వి. యల్.యస్. భీమశంకరం గారి పద్యకావ్యాలపై ప్రసంగించాను. ఆ కార్యక్రమం గురించి వివిధ పత్రికలలో ప్రచురించబడిన వివరాలు సాహిత్యాభిమానుల కోసం ..
- డా. ఆచార్య ఫణీంద్ర.



5, మే 2016, గురువారం

నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభా విశేషాలు


29/4/2016 నాడు హైదరాబాదులో నారాయణగూడలోని వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో జరిగిన మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యుల  వారి జయంతి సభలో ప్రముఖ కవయిత్రి, భద్రాచలం వాస్తవ్యురాలు శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి ఆచార్యుల వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని ప్రదానం చేసారు ఆనాటి ముఖ్య అతిథి - ప్రముఖ పద్యకవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు. ఈ సభకు "తెలుగు అకాడమి" పూర్వ సంచాలకులు డా. వెలచాల కొండలరావు గారు అధ్యక్షత వహించారు. సభలో నండూరి వారు రచించిన పద్య పఠన పోటీలలో విజేతలైన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులను అందజేసారు.

- డా. ఆచార్య ఫణీంద్ర