ఇప్పుడిక పద్యాలలో యతి, ప్రాసలను ఎలా వేయాలో తెలుసుకొందాం.
మన అక్షరాలను మనం ’అచ్చులు’, ’హల్లులు’ అని రెండు విభాగాలుగా నేర్చుకొన్నాం.
’అ’ నుండి ’ఆః’ వరకు ఉన్నవి అచ్చులు -
’క’ నుండి ’ఱ’ వరకు ఉన్నవి హల్లులు.
మన భాషలోని పదాలలో ప్రతి అక్షరంలో అచ్చు, హల్లు రెండు మిళితమై ఉంటాయి. అందుకే మనం ’గుణింతా’లని నేర్చుకొనేది.
మనం పద్యాలలో ’యతి మైత్రి’ వేసేప్పుడు అటు ’స్వర (అచ్చు) మైత్రి’, ఇటు ’వ్యంజన (హల్లు) మైత్రి’ రెండూ కుదిరేలా చూసుకోవాలి.
అచ్చులలో క్రింద పేర్కొన్న జట్టులలో వాటిలో వాటికే యతి కుదురుతుంది కానీ , వేరే వాటితో కుదరదు.
* అ,ఆ,ఐ,ఔ,అం,ఆః,య,హ
ఉదా|| ’అ’ల్పుడెపుడు పలుకు ’ఆ’డంబరముగాను
* ఇ,ఈ,ఎ,ఏ,ఋ,ౠ,
ఉదా|| ’ఇ’తరులెరుగకున్న ’ఈ’శ్వరు డెరుగడా?
* ఉ,ఊ,ఒ,ఓ
ఉదా|| ’ఉ’ప్పు కప్పురంబు ’ఒ’క్క పోలిక నుండు
పై మూడు జట్టులలోని అక్షరాలను గుర్తుంచుకొని, ఉదాహరణలను పరిశీలిస్తే విషయం బోధపడుతుంది.
’య’,’హ’ హల్లులైనా ఉచ్చారణ దగ్గరగా ఉండడం వలన ’అ’ జట్టులోని అచ్చులతో కూడి ఉంటే, ఆ అచ్చులతో యతి మైత్రి కుదురుతుంది.
ఉదా|| ’అ’ల్లరి మూక నేతలు మ’హా’త్ములటన్నను నమ్మ శక్యమే?
ఇందులో ’అ’కి, ’హా’కి యతి కుదిరింది. అలాగే మరొక
ఉదా|| ’య’జ్ఞ ఫలము నందుకొనిరి ’ఆ’తని పత్నుల్!
ఇక్కడ ’య’కి, ’ఆ’కి యతి మైత్రి కుదిరింది.
ఇక హల్లులలో ఏ ఏ జట్టులలో ఏ ఏ అక్షరాలకు యతి కుదురుతుందో చూద్దాం.
* క, ఖ, గ, ఘ, క్ష
ఉదా|| ’కం’చు మ్రోగినట్లు ’క’నకంబు మ్రోగునా?
ఇలాగే మిగితా జట్టులు ...
* చ, ఛ, జ, ఝ, శ, ష, స, క్ష, జ్ఞ
* ట, ఠ, డ, ఢ
* త, థ, ద, ధ
* న, ణ, o
* ప, ఫ, బ, భ, వ
* మ, oప, oఫ, oబ, oభ (ప్రత్యేకంగా... పు, పూ, పొ, పో, ఫు, ఫూ, ఫొ, ఫో, బు, బూ, బొ, బో, భు, భూ, భొ, భో- లతో ... ము, మూ, మొ, మో లకు యతి కుదురుతుంది.)
ఉదా|| ’మా’దు జనని! దుర్గమ్మ! అ’oబ’! దయ జూడు
అలాగే, మరో ఉదా|| ’పు’లతి అందమైన ’మో’ము జూడు
ఇంకా మిగిలిన జట్టులు ఇవి -
* ర, ఱ
* ల, ళ
* య, హ, అ,ఆ, ఐ, ఔ, అం, ఆః
ఒక ముఖ్య విషయమేమిటంటే, యతి మైత్రి అంటే - అచ్చు మైత్రి, హల్లు మైత్రి రెండూ తప్పకుండా కుదరాలి.
ఉదా|| ’దే’శ భాషలందు ’తె’లుగు లెస్స
ఇందులో ’ద’ కి, ’త’ కి హల్లు మైత్రి, అందులోని ’ఏ’ కి, ఇందులోని ’ఎ’కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి.
ఉదా|| ’స’జ్జనుండు పలుకు ’చ’ల్లగాను
ఇందులో ’స’ కి ’చ’ కి మధ్య హల్లు మైత్రి - మళ్ళీ అందులోని ’అ’ కి, ఇందులోని ’అ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి. మరొక ఉదా||
’చి’త్త శుద్ధి లేని ’శి’వ పూజలేలయా?
ఇందులో ’చ’ కి ’శ’ కి హల్లు మైత్రి మరియు అందులోని ’ఇ’ కి, ఇందులోని ’ఇ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి గదా!
ఇవి గాక ’ప్రాస యతి’ అని ఒకటుంది. ఇది అన్ని ఛందస్సులలో పనికి రాదు. కొన్ని ఛందస్సులలో అంగీకరింపబడుతుంది. ఉదాహరణకు ’సీసము’, ’తేట గీతి’, ’ఆట వెలది’ మొ||వి. పైగా, ఈ ఛందస్సులలో ప్రాస యతి వాడితే ఆ పద్యాలకు మంచి అందం కూడా వస్తుంది.
’ప్రాస యతి’ అంటే, ఆ యా అక్షరాలకు మధ్య యతి బదులు వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస వేయడం.
ఉదా|| ’ఇల్లు’ మొత్తమపుడు ’గుల్ల’యయ్యె
ఇందులో ’ఇ’ కి ’గు’ కి యతి కుదర లేదు. కాని వాటి ప్రక్కన రెండు చోట్లా ’ల్ల’ అన్న ప్రాస పడింది. ఇది ’ప్రాస యతి’
’యతి’ గురించి ఈ జ్ఞానం సరిపోతుంది.
ఇక ’ప్రాస’ - ఇది ఇంతకు ముందు పాఠంలో చెప్పుకొన్నట్టు పద్యంలోని ప్రతి పాదంలో రెండవ అక్షరం ఒకటే అదే హల్లుకు సంబంధించినది ఉండడం. అందులోని అచ్చు మారినా ఫరవా లేదు.
ఉదా|| క’oదు’కము వోలె సుజనుడు
క్రి’oదం’బడి మగుడి మీది
కెగయు జుమీ
మ’oదు’డు మృత్పిండము వలె
గ్రి’oదం’బడి యడగి యుండు
గృపణత్వమునన్
ఈ పద్యంలో బిందు పూర్వక దకార( oద) ప్రాస వేయబడింది. గమనించారు కదా!
ఈ విషయాలన్నీ మనసులో ఆకళించుకొని, ఈ మాసమంతా ఎక్కడ ఏ పద్యం కనిపించినా దానిలో యతి ప్రాసలు ఎలా వేసారో గమనిస్తూ, సాధికారతను సాధించండి.
వచ్చే నెలలో సులభంగా వృత్త పద్యాలు వ్రాయడం నేర్చుకొందాం మరి. ఇప్పటికిక సెలవు.
- డా.ఆచార్య ఫణీంద్ర
(సంపాదకుడు)
"సందేశ దీపిక" - నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి
12, ఏప్రిల్ 2009, ఆదివారం
8, ఏప్రిల్ 2009, బుధవారం
"ఆణిముత్యం" ... ఏప్రిల్ 2009
మెదడులోన ’మార్క్సు’, హృదిలోన బుద్ధుడై -
విప్లవమ్ము, కరుణ వింగడించి
పుట్టవలయు సుకవి భువనైక పౌరుడై
ప్రగతి కొరకు - నూత్న జగతి కొరకు!
వేమన వలె మా గురువు గారు రచించిన వేలాది ఆటవెలది ముక్తక పద్యాలలో ఇది ఒకటి.
మా గురువు గారు - స్వర్గీయ ’నండూరి రామకృష్ణమాచార్య’ సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక ఊపు ఊపింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ ఇది నీరాజనాలందుకొంటూనే ఉంది. మా గురువు గారు డా.నండూరి రామకృష్ణమాచార్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా 1987- 1990 మధ్య పని చేసారు.
వీరి ప్రసిద్ధ రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు.
’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో ’జాషువ’, ’కరుణశ్రీ’ మరియు మా గురువు గారిని ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది.
ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు.
మెదడులోని ఆలోచనా విధానంలో ’కార్ల్ మార్క్స్’ ప్రబోధించిన సామ్యవాదాత్మక విప్లవ భావాలను, అంతరంగంలో ’బుద్ధుడు’ బోధించిన కరుణ తత్త్వాన్ని కలిగి - సత్కవియైన వాడు ఈ ప్రపంచంలో ఒక విశిష్ట వ్యక్తిగా అవతరించి, ప్రగతిని సాధించేందుకు పాటుపడుతూ, ఒక నవ సమాజ నిర్మాణానికి దోహదపడాలని ఈ పద్య భావం. వైరుధ్య భావాలలో కూడా ఉన్న ’మంచి’ని గ్రహించి కవి ముందుకు సాగాలని గురువు గారు ఈ పద్యంలో కవిలోకానికి సందేశం అందించారు.

లేబుళ్లు:
కవితలు ; పద్య కవిత్వం,
తెలుగు,
తెలుగు పద్యం
5, ఏప్రిల్ 2009, ఆదివారం
ఈ మాసం పద్య కవిత ...(ఏప్రిల్ 2009)
అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రజ్ఞులు ఆచార్య వి.ఎల్.ఎస్. భీమ శంకరం గారు సాహిత్య లోకంలో ప్రౌఢ పద్య కవిగా ప్రసిద్ధులు. "రసస్రువు","శివానంద మందహాసం", "ద్రాక్షారామ భీమేశ్వర శతకం" మొదలైన రచనలతో ఆయన ఎనలేని ప్రఖ్యాతిని సాధించారు. ఆయన రచించిన "వసంత సభ" అన్న పద్య కవితను "ఈ మాసం పద్య కవిత"గా అందిస్తున్నాను.
ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు దయచేసి కొత్త విషయాలపై వ్రాసిన తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు.
- డా.ఆచార్య ఫణీంద్ర
విరోధి నామ సంవత్సర వసంత సభ
-------------------------------------
రచన: ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం
----------------------------------------
తెలతెలవారుచుండె, మది తీయని స్వప్నము తోడ నిండె, నే
తులుచన లేచి చెంత గల తోటకు నేగితి దైవ పూజకై
అలరులు కోయగా - నచట నబ్బుర మొప్పగ ప్రస్ఫురిల్లె క
న్నులు మిరుమిట్లు గొల్పగ వినూతన దృశ్యము లొక్క పెట్టునన్.
అపుడె ఉదయించు నాదిత్యు నరుణ కాంతి
కొలది కొలదిగ నన్ని దిక్కులకు కవిసి
నేల తల్లికి పారాణి నిమిరె ననగ -
ప్రకృతి కాంత కన్బడె నవ వధువు వోలె.
మొల్ల, సంపంగి, తంగేడు, పొగడ, మల్లె
మొల్లముల నుండి బహువర్ణ పుష్ప వృష్టి
నింగి హరివిల్లు నేలకు వంగుచుండె
ననగ నానంద పరిచె నా మనము నపుడు.
రంగు రంగుల అవనతాంబురుహ కుట్మ
లాంగనలు ఫుల్లమై లేచి భృంగ తతికి
నధర మకరంద నిష్యంద మధురమైన
చెరకు విలుతు లకోరీల బరపె నపుడు.
రంగు రంగుల పువ్వుల రంగశాల ,
రంగశాలను నర్తించు భృంగ చయము
లింపుగా తోచె కమనీయ దృశ్యముగను
హోలి యాడెడు రంగారు యువత వోలె
పిల్లగాలికి పూబాల ప్రేంకణములు,
ప్రేంకణంబుల చెలరేగి ప్రీతి గొల్పు
సరస పరిమళ సుమగంధ సౌరభంబు
లపుడు ప్రకటించె నామని ఆగమనము.
ఏమది! నేడు భూమి వసియించెడు స్థావర జంగమ వ్రజం
బామని శోభ దేలుచు సుఖాయుత దివ్య మనోజ్ఞ నాట్య గీ
తామృత మాస్వదించుటకునై మది నీవిధి నిశ్చితార్థులై
కామనతో వసంత సభ కాముని పండువుగా రచించిరో!
అవిగో - అల్లవిగో - అవే! నవ వసంతారంభ సంరంభముల్
రవిబింబం బరుణ ప్రియంగువులతో ప్రాచీ దిశన్ గప్పెడున్,
శ్రవణానంద మహోదయాగమున సంరావంబు విన్వచ్చెడున్,
భువి నేతెంచె 'విరోధి' ఆంధ్ర జన సమ్మోద ప్రమోదంబుగాన్.
పేరులో 'విరోధి'యె గాని ప్రేమ తోడ
జనుల సాకగా వచ్చిన సౌమ్య మూర్తి ,
మనల కాయురారోగ్య కామనల దీర్చు
వత్సరంబని నా మన ముత్సహించె.
--- *** ---
లేబుళ్లు:
కవితలు ; పద్య కవిత్వం,
తెలుగు పద్యం,
పద్య కవులు,
సాహిత్యం
4, ఏప్రిల్ 2009, శనివారం
సమస్యను పరిష్కరించండి ... (ఏప్రిల్ 2009)
'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :
"జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే!"
ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 ఏప్రిల్ 2009
- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

31, మార్చి 2009, మంగళవారం
పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా. ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - మూడవ భాగం
భా.రా.:సంస్కృత పదాలను సులభంగా ఎలా గుర్తించాలి? సంధిచేసేటప్పుడు ప్రతిసారి నాకు ఈ ప్రశ్న వుత్పన్నమౌతుంది.
ఆ.ఫ.:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని 'దుష్ట సమాసాలు' అంటారు. వార్తా పత్రికలలో భాషా ప్రమాణాలు మరీ దిగజారి ఈ మధ్య ఇవి బాగా వ్యాపించి భాషను ఖూనీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా 'పాలాభిషేకం' అని వ్రాస్తున్నారు. ఇక్కడ 'పాలు'- తెలుగు పదం; 'అభిషేకం'- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని 'క్షీరాభిషేకం' అనాలి. దురదృష్ట మేమిటంటే ఇప్పుడు పొద్దున్న లేచి చూస్తే, ప్రసిద్ధి చెందిన వార్తా పత్రికలలోనే ఇలాంటి దోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అయితే వ్యవహార భాషలో ఎలా 'ఏడ్చినా', పద్యాలలో వీటిని పండితులు అంగీకరించరు. మరి ఈ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏది సంస్కృత శబ్దం, ఏది తెలుగు శబ్దం అన్న పరిజ్ఞానం ఉండాలి.
ఒక చిన్న బండ గుర్తు ఉంది. మన అక్షరాలలో 'అల్ప ప్రాణాలు', 'మహా ప్రాణాలు' అని ఉన్నాయి. 'క, గ, చ, జ, త, ప, బ, మ, య, ల...' మొ||వి అల్ప ప్రాణాలు. ' ఖ, ఘ, ఛ, ఝ, థ, ధ, ఫ, భ...' మొ||వి మహాప్రాణాలు. అన్ని అల్ప ప్రాణాలున్న పదాలు 'తెలుగు పదాలు' అని చెప్పలేం గానీ - పదంలో ఒక్క మహాప్రాణమున్నా అది సంస్కృత పదమని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగులో మహాప్రాణ అక్షరాలు లేవు. అవి సంసృతం నుండి గ్రహించినవే. 'బడి, గుడి, బండ, మల్లె, పువ్వు, తీగ ... ఇలా అన్నీ తెలుగు పదాలు. అంత మాత్రాన 'లత, దేవాలయం, కాలం, జగతి...' కూడా తెలుగు పదాలు కావు. ఎందుకంటే సంస్కృతంలో కూడా అల్పప్రాణ అక్షరాలు ఉంటాయి. కానీ, 'ధర్మం, ఫలం, మోక్షం, భయం...' ఇలా మహాప్రాణం ఒక్కటున్నా అది కచ్చితంగా సంస్కృత శబ్దమే! అయితే ఈ అయోమయమేమీ లేకుండా ఉండాలంటే ' శబ్ద రత్నాకరం' లేదా 'సూర్య రాయాంధ్ర నిఘంటువు' - ఈ రెండు నిఘంటువులలో ఏది చూచినా, ప్రతి పదం పక్కన అది సంస్కృత పదమా, లేక తెలుగు పదమా వ్రాసి ఉంటుంది. సమాసం చేసేప్పుడు ఏదైనా సందేహం వస్తే వాటిలో చూసుకోవచ్చు.
భా.రా.:నానార్థాల,వ్యుత్పత్తి అర్థాల కొరకు మంచి నిఘంటువులేమైనా వుంటే తెలియ జేయండి.
ఆ.ఫ.: తెలుగులో ఇటీవల నానార్థాలపై ఒక చక్కని గ్రంథం వచ్చింది. డా. పి. నరసింహా రెడ్డి రచించిన 'తెలుగు నానార్థ పద నిఘంటువు' అది. ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాదు వారి ప్రచురణ. అలాగే పర్యాయ పదాలపై జి. ఎన్. రెడ్డి గారి 'తెలుగు పర్యాయ పద నిఘంటువు' కూడా ఒక మంచి గ్రంథం. ఇక తెలుగు పదాలకు వ్యుత్పత్తి అర్థాలు ఉండవనే చెప్పాలి. 'చెంబు, గుడి, బండ...' మొ||న పదాలకు ఏం వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. సంస్కృత పదాలకే వ్యుత్పత్తి అర్థాలు చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకోవాలంటే శ్రీ చలమచర్ల వేంకట శేషాచార్యులు రచించిన 'అమర కోశం- సంస్కృతాంధ్ర వివరణము' అన్న గ్రంథం చాలా అమూల్యమైనది.
భా.రా.: ఆచార్య ఫణీంద్ర గారు! సహృదయంతో శ్రమకోర్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఓర్పుతో నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సదా కృతఙ్ఞుడను.
ఆ.ఫ.: రామిరెడ్డి గారు! మీ వల్ల బ్లాగు మిత్రులకు తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం లభించింది. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.
(పరిసమాప్తం)

27, మార్చి 2009, శుక్రవారం
సంపాదకీయం (మార్చి 2009) - డా.ఆచార్య ఫణీంద్ర
సంపాదకీయం (మార్చి 2009)
- డా.ఆచార్య ఫణీంద్ర
గత నెల ప్రారంభించిన ఈ మా ’పీఠం’ అధికార (బ్లాగు) సంచిక విశేషాదరణను పొందిందనే చెప్పాలి. ఫిబ్రవరిలో వాగ్దానం చేసిన మేరకు, ఈ నెల ’సులువుగా పద్యం వ్రాయండి’ శీర్షిక ద్వారా పద్య రచనను బోధించే పాఠాలను ధారావాహకంగా ప్రారంభించాను. అంతర్జాలంలో చాలా మంది పద్య కవులు చేస్తున్న తప్పులను తెలియజెప్పే ఒక టపాను కూడా అందించాను. భావిలో ఇలాంటి టపాలను అడపా దడపా అందిస్తూ పద్య కవితాభివృద్ధికి నా వంతు ’ఉడుత’ సాయం చేయదలిచాను.ఇవి గాక ’హారం.కాం’ భాస్కర రామిరెడ్డి గారు "ఇలాంటి బ్లాగు కోసం చాలా రోజుల నుండి వెదుకుతున్నా" నంటూ, పద్య రచన గురించి అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలను ’ముఖాముఖి’ గా అందిస్తున్నాను.
గత మాసంలాగే ఈ మాసం కూడా మా గురువు గారు దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఒక మంచి పద్యాన్ని ’ఆణిముత్యం’ శీర్షిక ద్వారా అందించాను. అయితే వచ్చే నెల నుండి దీనిని వ్యాఖ్యాన సహితంగా అందించే ప్రయత్నం చేస్తాను.అప్పుడు పాఠకులకు ఆ పద్యాల వైశిష్ట్యం సుబోధకమవుతుంది.
’ఈ మాసం పద్య కవిత’ శీర్షికలో ప్రచురణార్థం పాఠకులు తమ పద్య కవితలను dr.acharya_phaneendra@in.com కు మెయిల్ చేయమని మరొకమారు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక ఈ నెల ’సమస్యను పరిష్కరించండి’కి ఒక్క పూరణ మాత్రమే వచ్చింది. బహుశః పాఠకులు సమస్య కాస్త క్లిష్టంగా ఉందని భావించారేమో! అయితే అందరిలా కాక, నేను సమకాలీన, నవీన విషయాలకు సంబంధించిన సమస్యలనే ఈయ దలిచాను. దీని వలన పద్యంలో ఆధునిక భావాలను వెల్లడించడంలో పాఠకులకు అభ్యాసం అయి, పద్యాన్ని సార్వ కాలీన ప్రక్రియగా నిలబెట్టే మహదాశయానికి దోహదం చేసిన వారమవుతాం.
"పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్" అన్న సమస్యకు శ్రీ ’హరి దోర్ణల’ గారి పూరణ ప్రశంసనీయంగా ఉంది. హరి గారి పూరణ ఇది -
"పది రూపాయల నోటుతో నిపుడు ఏ పాటైన నిండేన కు
క్షి? ది గ్రేట్ సీ.యము.రాజశేఖరుని సాక్షిన్, కొద్ది బియ్యంబునే
ఇదిగో యంచిడె రెండు రూప్యములకే - ఏ మూల కౌనద్ది? ము
ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్!"
సమస్యను రూపొందించిన సంపాదకునిగా, నా పూరణ ఇలా ఉంది -
"ఎదియో కొందరికంట బియ్య మిక రెండేరెండు రూపాయలే -
అదియున్, మొత్తము నిత్తు రిర్వది కిలో లంతే! మరా పైన - ఏ
బది కొట్టుల్ వెదుకాడిన, న్నొక కిలో బాజారులో చూడ - ము
ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్!"
ఈ బ్లాగుకు నేను సంపాదకుడను మాత్రమే. ఇందులో నా రచనల కన్న, ఎక్కువగా పాఠకుల రచనలను ప్రచురించడానికే ప్రాధాన్యతనిస్తాను. కాబట్టి పాఠకులు - ముఖ్యంగా పద్య కవులు, పద్య ప్రియులు అత్యధికంగా ఈ బ్లాగులోని వివిధ శీర్షికలలో బహుళంగా పాలు పంచుకొని పద్య కవితాభివృద్ధికి తోడ్పడాలని వేడుకొంటున్నాను.
పాఠకులందరికీ ’విరోధి’ నామ సంవత్సర ’ఉగాది’ శుభ కామనలు

23, మార్చి 2009, సోమవారం
పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా. ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - రెండవ భాగం
భా.రా.: గణాలు చూసుకుంటూ పద్యం రాస్తారా లేక పద్యం వ్రాసే టప్పుడు వచ్చే పదాల గణాలను చూసుకొని పద్యం మారుస్తారా?
ఆ.ఫ.:"కవి యన్న వాడు ఆర్తితో అరిస్తే అది ఏదో ఒక ఛందస్సులో ఉంటుంది" అన్నారు ఆరుద్ర . ఇంతకు ముందు ప్రశ్నకు చెప్పిన సమాధానంలో అన్నట్టు 'ఉత్పల మాల', చంపక మాల', 'కందం', 'సీసం' మొదలైన ఛందస్సులలో పూర్తి సాధికారత పొందేలా అభ్యాసం చేసిన వారికి - తొలి భావం ఏ ఛందస్సులో పలుకుతుందో, అదే ఛందస్సులోనే మిగితా భావం కూడా సునాయాసంగా సాగిపోతుంది. అప్పుడు ఆ కవి దృష్టి - గణాలు, ఛందస్సుపై ఉండదు. సముచితమైన పదాలను వాడుతున్నానా? లేక ఇంకా మెరుగైన పదాలను వాడగలనా? అనుకొన్న భావాన్ని పలికించ గలుగుతున్నానా? లేక ఇంక మెరుగైన భావ వ్యక్తీకరణ సాధ్యమా? - అని ఆలోచిస్తాడు. తాను ఇదివరకే చేసిన అభ్యాస ఫలితంగా ఎలాంటి దోషాలు లేకుండా గణాలు పరిగెత్తుతుంటాయి. తన అభివ్యక్తిలో పరిపక్వత కోసం కవి పద్యాన్ని పునస్సమీక్షించుకొంటూ పద్యంలో అవసరమనుకొన్న చోట్ల మార్పులు చేస్తూ పరిపూర్ణంగా సంతృప్తి కలిగే వరకు దానిని చెక్కుతూనే ఉంటాడు.
భా.రా.: యతి చాలా రకాలుగదా ? సులభంగా గుర్తుంచుకొనే మార్గాలు ఏమైనా వున్నాయా?
ఆ.ఫ.: నిజమే! యతులలో చాలా రకాలున్నాయి. అందులో 'ప్రాస యతి' వృత్తాలలో, 'కందం'లో చెల్లుబాటు కాదు. కాని 'సీసం'లో, 'ఆట వెలది', 'తేట గీతి' మొదలైన పద్యాలలో అది చాల అందాన్ని సమకూరుస్తుంది. 'ప్రాస యతి' అంటే 'యతి' బదులు ప్రక్క అక్షరంతో ప్రాస వేయడం. ఉదాహరణకు - "ఇల్లు మొత్త మతడు గుల్ల చేసె". ఇందులో 'ఇ'కి, 'గు'కి యతి కుదర లేదు. వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస(ఇల్లు - గుల్ల) పడింది.
'అఖండ యతి' అని ఉంది. దీనిని 'అప్ప కవి' వంటి లాక్షణికులు అంగీకరించ లేదు. కానీ ప్రాచీన కవులలోనే కొంత మంది ఆయన మాటను పెడ చెవిన పెట్టి దీనిని ప్రయోగించారు. సరే - ఇవన్నీ కవికి వెసులుబాటు కల్పించేందుకు ఉన్నవే కాని, కవి తప్పకుండా తెలుసుకొని ప్రయోగించాలన్న నియమమేమీ లేదు. వీటి కన్నా కవి డైరెక్టుగా 'యతి మైత్రి' వేస్తేనే పండితులు హర్షిస్తారు. కాబట్టి కవి 'యతి' వేయ వలసిన స్థానంలో 'స్వర(అచ్చు) మైత్రి, వ్యంజన(హల్లు) మైత్రి కుదిరిందా చూసుకొంటే సరిపోతుంది. (సశేషం)

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)