23, ఏప్రిల్ 2012, సోమవారం

పద్య కవితా పురస్కారం - 2012


వార్తా విశేషాలు : ఏప్రిల్ 2012
2012 వ సంవత్సరానికిగాను ’నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారం’ సుప్రసిద్ధ పద్యకవి శ్రీ దుగ్గిరాల రామారావుకు ప్రదానం చేయనున్నట్టు ’నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం’ ప్రధాన కార్యదర్శి ’డా. ఆచార్య ఫణీంద్ర’ ప్రకటించారు. ’అమృత కలశం’, ’ఆంధ్ర రస మంజరి’, ’కామేశ్వరీ వైభవం’ వంటి ఎన్నో సుమధుర కావ్యాలను వెలయించిన రామారావు గారు యువకవిగానే, తిరుపతి వేంకట కవులలో ఒకరైన ’చెల్లపిళ్ళ వేంకట శాస్త్రి’ గారి ఆశీస్సులను అందుకొన్నారు. చెన్నై వాస్తవ్యులుగా ఉన్నప్పుడు ఆయనకు 'ఆరుద్ర', 'ఆత్రేయ'లతో బాటు 'మద్రాసు విశ్వ విద్యాలయం' తెలుగు పండితులు అనేకులతో సాహచర్యం లభించింది. ఆ తరువాత హైదరాబాదు చేరుకొన్నాక, 'డా. సి.నారాయణ రెడ్డి', 'డా. నండూరి రామకృష్ణమాచార్య' వంటి మహాకవుల ప్రశంసల నందుకొన్నారు. దుగ్గిరాల వారు తమ 'అమృత కలశం' కావ్యానికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం' పురస్కారం అందుకొన్నారు. దుగ్గిరాల రామారావు గారికి ఈ నెల 29 నాడు హైదరాబాదులోని 'శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం'లో ’నండూరి రామకృష్ణమాచార్య 92వ జయంత్యుత్సవ సభ’లో నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని పలువురు ప్రముఖ కవి పండితుల సమక్షంలో ప్రదానం చేయబడుతుందని ఆచార్య ఫణీంద్ర వివరించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి