1, మే 2012, మంగళవారం

సరస సల్లాపము - 21





చరిత్రలో దాఖలాలు లేవు గాని, కవయిత్రి మొల్లమాంబకు, తెనాలి రామకృష్ణునికి వాగ్యుద్ధాలు జరిగినట్లుగా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
అలాంటిదే ఇది.
మొల్ల కుమ్మరి పిల్ల అని జగమెల్ల ఎరిగినదే. ఒకనాడు ఆమె సంతలో కుండలను పెట్టుకొని అమ్ముకొంటుంది. ఆ సమయంలో అటువైపు వచ్చిన తెనాలి రామకృష్ణుడు కొంటెతనంతో ఆమె చెంతకు చేరి, సమాన పరిమాణంలో ఉన్న రెండు కుండలను చేతితో చూపుతూ, కళ్ళతో ఆమె స్థన యుగ్మాన్ని వీక్షిస్తూ - " పిల్లా! నీ కుంభద్వయిని ఎంత కిస్తావు?" అని అడిగినాడు. 
దానికి ఆ కవయిత్రి ఇచ్చిన  సమాధానం - "నేను నీకు అమ్మనురా!"

4 కామెంట్‌లు:

  1. మొల్ల, రామకృష్ణుల మధ్య జరిగినవి కొన్ని చదవడం, వినడం జరిగింది. ఇది మాత్రం నాకు క్రొత్తది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. తెనాలి రామలింగడు, తెనాలి రామకృష్ణుడు అనే రెందు వ్యక్తులను కలగాపులగం చేసి అనేక హాస్యవిషయకమైన మాటలు వచ్చాయి.

    మొదటిది తెనాలి రామకృష్ణకవి రాయలకాలానికి తరువాతి వాడు. తన గ్రంథాన్ని రాయల అల్లుడికి అంకితం ఇచ్చాడు.

    రెందవది తెనాలి రామకృష్ణుడి పాందురంగమహాత్మ్యంలో మచ్చుకు కూడా హాస్యం లేదు.

    మూడవది తెనాలి రామలింగడు అంటూ యెవరూ ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. ఆ పాత్రకు రాయలతోనూ అష్టదిగ్గజకవులతోనూ ముడిపెట్టటం, తెనాలి రామకృష్ణుడితో యేకం చేయటం అన్యాయం.

    ఇటువంటి హాస్యకథలు యెవరికీ యేమీ ఉపయోగించవు. పై కథ తెనాలి రామకృష్ణుడి స్థాయికి తగ్గది కాదు కదా!

    రిప్లయితొలగించండి
  3. ఆత్మీయ మిత్రులు శంకరయ్య గారికి
    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయం గారు!
    మీరు చెప్పిన విషయాలన్నీ నేనే కాదు - చాల మంది ఎరుగుదురు.
    అందుకే ప్ర్రారంభంలోనే - "చరిత్రలో దాఖలాలు లేవు గాని..." అన్నాను. మీరది గమనించినట్టు లేదు.
    మన ప్రాచీన కవులలో అత్యధికులు శృంగార ప్రియులే! వారి వ్యక్తిత్వాలను ఈనాటి ప్రమాణాలతో బేరీజు వేసేట్టయితే, మీరు ’శ్రీనాధుని’ ఎక్కడ నిలుపుతారు?
    ఈ సల్లాపంలో ప్రధానమైనది - "నేను నీకు అమ్మనురా!" అన్న మాటలోని శ్లేష మాధుర్య రసాస్వాదన.
    మీరు ఈ మధ్య రసదృష్టిని ప్రక్కన బెట్టి, ఇతర విషయాలపై వ్యాఖ్యలు చేస్తున్నారు.
    నా దృష్టిలో సాహిత్యానికి రసమే ప్రధానం!
    "రసోవై సః"
    ఏమైనా, మీకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి