12, నవంబర్ 2010, శుక్రవారం

సరస సల్లాపము - 9



’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ అవసాన దశలో హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళో, రేపో అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఆయన కాత్మీయుడయిన ఒక శిష్యుడు పరామర్శించడానికి వెళ్ళాడు. ఏదో రకంగా ధైర్యం చెప్పాలి కాబట్టి, ఆ శిష్యుడు గురువుగారితో " డాక్టరు గారితో మాట్లాడాను ... ఏం భయం లేదన్నారు " అన్నాడు. వెంటనే విశ్వనాథ వారన్న మాట - " వాడి బొంద! వాడికేం భయం? పోతే ... నేను పోతాను."
పక్కనే ఉన్న నర్సు కిసిక్కుమంది.

2 కామెంట్‌లు:

  1. విశ్వనాధుడు అస్వస్త వివశుడవగ
    ఫ్రెండు విసిరెను చెళుకులు మెండు గాను;
    కవియు చెప్పెను ధీటుగ కచ్చ దీర!
    విశ్వకవికీర్తి ఎప్పుడు శాశ్వతంబె!

    రిప్లయితొలగించండి
  2. వెంకటప్పయ్య గారు!
    పద్యంలో అక్షర దోషాలు దిద్ది, భావ స్పష్టతకై ఇంకా మెరుగులు దిద్దాలేమో చూడండి.
    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి