11, సెప్టెంబర్ 2010, శనివారం

సరస సల్లాపము - 5

నిజాం రాష్ట్రంలో కమ్యూనిస్ట్ భావాలతో ఫ్యూడల్ వ్యతిరేక పోరాట కవిగా అప్పుడప్పుడే ప్రసిద్ధిని పొందుతున్న ’ కాళోజి ’ ని, అప్పటి ’ యాదగిరి గుట్ట ’ దేవస్థానం కార్యవర్గం, ఒక కార్యక్రమంలో కావ్యగానం చేయమని ఆహ్వానించింది. ఆ యువకవి అందిందే అవకాశమనుకొని, తన ’ నిజాం వ్యతిరేక పోరాట కవిత్వం ’ వినిపించి, ప్రజలను ఉర్రూతలూగించాడు.
ఆ తరువాత ఒక కమ్యూనిస్ట్ స్నేహితుడు, కాళోజిని " నువ్వొక అభ్యుదయ కవివైయుండి, దేవస్థానంలో కవిత్వం చదువుతావా ? " అంటూ నిలదీసాడు. దానికి కాళోజి " నేను దేవస్థానంలో చదివినా, చదివింది మాత్రం అభ్యుదయ కవిత్వమే ! " అని చెప్పి, " పైగా ... నాకు నరసింహ స్వామి ఆదర్శం ! " అన్నాడు. ఆశ్చర్యంగా చూసిన ఆమిత్రునికి కాళోజి ఇలా వివరించాడు -
" విశ్వ చరిత్రలో అరాచకాలు చేసిన మొట్టమొదటి నియంతృత్వ చక్రవర్తి - హిరణ్య కశిపుడు ! ఆ నియంత ఎంత వేధించినా, శాంతియుతంగా సత్యాగ్రహం ద్వారా తన స్వాతంత్ర్యం కోసం పోరాడిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు - ప్రహ్లాదుడు ! ఆ నియంతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, చట్టాన్ని చేతిలోకి తీసుకొని, చక్రవర్తినే హత్య చేసిన మొట్టమొదటి విప్లవకారుడు - నరసింహ స్వామి ! "
ఆ సమాధానం విని నిరుత్తరుడయిన సదరు కమ్యూనిస్ట్ మిత్రుడు తోక ముడిచి వెళ్ళిపోయాడు.

4 కామెంట్‌లు:

  1. కాళోజీ సమర్థన చాలా బాగుంది.

    మీరు ఇలాంటి చమక్కులు ఇంకా చాలా వ్రాయాలి.

    రిప్లయితొలగించండి
  2. కృష్ణశ్రీ గారు !
    తప్పకుండా ఈ శీర్షికను కొనసాగిస్తాను.
    మీ అభిమానానికి ధన్యవాదాలు !
    మా గురువు గారికి నివాళిగా - ఇంకా ఈ బ్లాగు ద్వారా చాలా చేయాలని ఉంది కానీ, సమయం చిక్కడం లేదు.

    రిప్లయితొలగించండి
  3. డా.ఆచార్య ఫణీంద్ర గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

    హారం

    రిప్లయితొలగించండి
  4. తెలుగు బ్లాగుల పాలిట మణి హారం - ’ హారం ’ నిర్వాహకులు,
    ఆత్మీయ మిత్రులు శ్రీ భాస్కర రామిరెడ్డి గారికి ధన్యవాదాలు !
    హృదయపూర్వక శుభాభినందనలు !

    రిప్లయితొలగించండి