నగరంలోని ’త్యాగరాయ గానసభ’లో ఒక ప్రసిద్ధ సంస్థ నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని, కవులమంతా సరదాగా మాట్లాడుకొంటూ రోడ్డెక్కాం. పక్కనే ఉన్న ’సుధా దర్శని’ హోటల్లో ”టీ త్రాగుదాం రండి” అంటూ కవులందరినీ ఆహ్వానించాను. హోటల్లోకి వెళ్ళాక - ”నేను టీ తీసుకొంటాను. మీకు ’టీ’ యా? ’కాఫీ’ యా?” అని అడిగాను. వెంటనే కవి మిత్రుడు ’దత్తాత్రేయ శర్మ’ - ”మేమంతా ’టీ’చరులమే!” అన్నారు. అందరం నవ్వుకొంటూ ’టీ’ సేవించాం.
VERY INTRESTING
రిప్లయితొలగించండిwow... :-)
రిప్లయితొలగించండివీటిని ఛలోక్తులంటారనుకుంటా...... కరెక్టేనాండీ....??
పానుగంటి వారికి ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిమాధవి గారు!
రిప్లయితొలగించండిఛలోక్తులతో కూడిన సంభాషణనే ’సరస సల్లాపము’ అంటారు.
మీకు నా ధన్యవాదాలు!