"సందేశ దీపిక" - నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి
22, ఏప్రిల్ 2016, శుక్రవారం
17, ఫిబ్రవరి 2016, బుధవారం
డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారి సంతాప సభ
నిజాం వ్యతిరేక స్వాతంత్ర్య సమర యోధులు, ప్రముఖ రచయిత, హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శిగా గత 50 ఏళ్లుగా విశిష్ట సేవలందించిన డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారు 12/2/2016 నాడు ఉదయం పరమపదించారు. వారి సంతాప సభ ఈ రోజు భాషానిలయంలోనే .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే. వి. రమణాచారి గారి అధ్యక్షతన జరిగింది. ఆచార్య రవ్వా శ్రీహరి గారు, ఆచార్య ఎస్. వి. రామారావు గారు, శ్రీ ఉడయవర్లు గారు, శ్రీ జి.ఎస్. వరదాచారి గారు, శ్రీ సి.వి. చారి గారు, శ్రీ నూతి శంకర రావు గారు, శ్రీ చీకోలు సుందరయ్య గారు, డా. ఆచార్య ఫణీంద్ర తదితరులు పాల్గొని కీర్తిశేషులు ఎమ్. ఎల్ గారికి నివాళులను అర్పించారు.
- డా. ఆచార్య ఫణీంద్ర
26, డిసెంబర్ 2015, శనివారం
పడతుల అష్ట కష్టావధానం!
రచన : మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు
సీ.అడు గడుగున నిషేధాజ్ఞ జారీచేయ
మగడు నిషిధ్ధాక్షరిగను దోప -
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వలతోడ
మాసమ్ము గడుప సమస్య కాగ -
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు
దత్తుండు దత్త పదంబు కాగ -
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి
వర్ణనీయాంశమై వరలు చుండ -
పాలు కూరలు పండ్ల బండ్ల వారల రాక
యాశుధారా కవిత్వార్ధ మనఁగ -
అత్తయ్య వేసెడి యక్షింత లవియన్ని
పాత పురాణంపు పఠన మనఁగ -
పోనీని రానీని ఫోను మ్రోతల రోత
ఘంటికా గణనమ్ము కరణి దోఁప -
బోరు గొట్టించెడి ధారవాహిక సుత్తి
యధిక ప్రసంగమై యడ్డుపడఁగ -
తే.గీ.
దినము దిన మిట్లు వనితలు తిప్పలుపడి
పూటపూటకు నవధాన పూర్ణసిధ్ధి
తనరుచుండఁగ పురుషావధానులేల?
వర సహస్రావధానులీ పడతు లెల్ల!
17, డిసెంబర్ 2015, గురువారం
చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారికి పద్య కవితా పురస్కారం
2016 సంవత్సరానికి గాను మా గురువు గారు - దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారాన్ని సుప్రసిద్ధ కవయిత్రి శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారికి ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
"భద్రాచల రామదాసు", "మాతృభూమి" వంటి కావ్యాలను రచించిన శ్రీమతి లక్ష్మీనరసమ్మ ( ఖమ్మం జిల్లా, భద్రాచలం వాస్తవ్యురాలు) గారికి 29 ఏప్రిల్ 2016 నాడు హైదరాబాదులో నిర్వహించే డా.నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభలో ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది.
- డా. ఆచార్య ఫణీంద్ర
కార్యదర్శి - నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం
హైదరాబాద్.
2, మే 2015, శనివారం
నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభా విశేషాలు
29/04/2015 నాడు జరిగిన మహాకవి స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య 95వ జయంతి సభా విశేషాలు:
(వివిధ పత్రికల సౌజన్యంతో -)
సాక్షి:
ఈనాడు :
ఆంధ్ర జ్యోతి :
వార్త :
మన తెలంగాణ :
23, ఏప్రిల్ 2015, గురువారం
నండూరి వారి జయంతి సభ
పద్య కవితా తపస్వి, మా గురువు గారు, స్వర్గీయ నండూరి రామకృష్ణమాచార్య గారి 95 వ జయంతి సభ 29 ఏప్రిల్ 2015 నాడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులో నారాయణగూడ - వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది.. ప్రముఖ కవి డా.జె.బాపురెడ్డి గారికి నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారం ప్రదానం చేయబడుతుంది. సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం.
- డా. ఆచార్య ఫణీంద్ర
- డా. ఆచార్య ఫణీంద్ర
9, డిసెంబర్ 2014, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)








