15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !

విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగులీనుతున్న భారతీయులందరికీ
63వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !



అగ్ర భాగమ్ములో అమరి కాషాయంబు,
హరిత వర్ణ మమరి అడుగునందు,
చేరి రెంటి నడుమ శ్వేత వర్ణ, ’మశోక
చక్ర’ మమరి మధ్య చక్కగాను -
పాతాళమందుండి పైపైకి ఎగబ్రాకి
ఆకాశ హర్మ్యాల తాకునట్లు
నిలువెత్తు ధ్వజముపై నిలుచుండి నింగిలో
మన్ననల్ పొందెరా మన పతాక!

పూర్ణ విశ్వమందు పుడమి భారతి మిన్న -
దీటు లేదు భువిని దీని కేది! -
అన్న రీతి నెగిరె ఆకాశమందునన్
మూడు వన్నె లొలుకు ముద్దు జెండ!

4 కామెంట్‌లు:

  1. Please include your email id in your profile. Then only it will be called పూర్తి ప్రొఫైల్‌.

    రిప్లయితొలగించండి
  2. పూర్ణ విశ్వమందు పుడమి భారతి మిన్న -
    దీటు లేదు భువిని దీని కేది! -
    అన్న రీతి నెగిరె ఆకాశమందునన్
    మూడు వన్నె లొలుకు ముద్దు జెండ!
    చాలా బాగారాసారండి!

    రిప్లయితొలగించండి
  3. మూడు రంగుల దిది మురిపాల మనజెండ
    పచ్చ రంగు దెల్పు పాడి పంట
    త్యాగ నిరతి దెల్పు తగను కాషాయంబు
    తెలుపు శాంతి దెల్పు తేటముగను

    రిప్లయితొలగించండి
  4. సృజన గారు ! ధన్యవాదాలు !
    హరి గారు ! మీ పొడిగింపు బాగుంది. అభినందనలు !

    రిప్లయితొలగించండి