'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :
" జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)
సమస్య ఇచ్చి ఇన్ని రోజులయింది. ఒక్కరూ స్పందించడం లేదేమిటి? మాతృవియోగదుఃఖంలో ఉన్న నేను సమస్యాపూరణంలో ఉత్సాహం చూపలేకపోతున్నాను.
రిప్లయితొలగించండిశంకరయ్య గారు !
రిప్లయితొలగించండినేనూ అదే చూస్తున్నాను - " మీరయినా స్పందించలేదేమిటా ? " అని.
మీకు మాతృ వియోగం ప్రాప్తించినందుకు చింతిస్తున్నాను.
కం|| నవ మాసంబులు మోసియు
భువిపై జన్మంబునిచ్చి, ముద్దుగ తా పెం
పు వహించిన తల్లి వియో
గ విధిని తట్టుకొను శక్తి కలుగుత మీకున్ !
స్థాయికి మించిన పనిగా భావించి మొదట వదిలి వేసాను. కాని ఎవరూ ముందుకు రాక పోవడంతో నేనే చిన్ని ప్రయత్నం చేస్తున్నాను. తప్పులను క్షమించి సరి దిద్ద గలరు.
రిప్లయితొలగించండిజలమో యంచును జేయు పూజలకు కూసంతైన జాల్లేకయున్
కలియే నాట్యము చేసెనా యనగ పొంగారెన్ నదీ మాతలే
కలలో నైనను గాంతుమే నిటుల హాకారాల ఆర్త ధ్వనుల్
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే
హరి గారు !
రిప్లయితొలగించండిప్రయత్నం చేస్తేనే గదా పట్టుబడేది.
పద్యం బాగా నడిచింది - ఒక్క ’ జాల్లేక ’ తప్ప.
అది ’ జాలి లేక ’ అని ఉండాలి. గణాలు కుదరనప్పుడు వేరేలా ప్రయత్నించాలి.
’ కూసంతైన జాల్లేకయున్ ’ అన్న చోట ... ’ కాస్తంతన్ దయే లేని ఆ ’ అని మారిస్తే సరిపోతుంది.
ఇంకాస్త మెరుగు దిద్దితే, మీ పద్యం ఇలా హృద్యంగా ఉంటుంది.
" జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "
మీకు నా ధన్యవాదాలు !
జలమే ప్రాణము నిల్పు జీవ తతికిన్ స్నానంబు పానంబునై
రిప్లయితొలగించండిజలమే వంటకు, పాడిపంటకు, ప్రజా సంసార సామాగ్రికిన్
విలయంబై కరకట్ట దాటి పరుగుల్ వెట్టంగ పృద్వీస్థలిన్
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే !
ఆచార్య గారు,
రిప్లయితొలగించండిమీ సవరణలకు, సూచనలకు, ప్రోత్సాహానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
జిగురు సత్యనారాయణ గారికి
రిప్లయితొలగించండిధన్యవాదాలు