29, నవంబర్ 2009, ఆదివారం

ఆణిముత్యం ( నవంబరు 2009 )



"అరుగుదెంచి ఎపుడొ అవకాశ మొకమారు
ద్వారము కడ నిల్చి తలుపు తట్టు -
తత్క్షణమ్ము వెడలి తలుపు తీయనియెడన్
మరలి పోవు నద్ది - మరల రాదు!"


ఇది మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల కలం నుండి జాలువారిన సందేశాత్మకమైన పద్యాలలో ఒకటి. ఆణిముత్యంలాంటి ఈ పద్యానికి వ్యాఖ్యానం అవసరం లేదని భావిస్తాను. అందరూ ( ముఖ్యంగా యువతరం )
అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
- డా.ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

5 కామెంట్‌లు:

  1. ఆచార్య ఫణీంద్ర గారు,

    అద్భుతమైన భావంతో చక్కని పద్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నండూరి వారికి, మీకు క్షమాపణలతో నాదొక చిన్న సెటైర్.

    అరుగు దెంచు నంచు అవకాశ మెప్పుడో
    ఎదురు చూడ బోకు ఇంటి లోన
    తలుపు తెరిచి బయట దారి కాచిన యెడ
    దొరుక గలదు నదియె తొందరగను

    రిప్లయితొలగించండి
  2. హరి గారు !
    మీ పద్యం కూడా బాగుంది.
    అయితే, మా గురువు గారు చెప్పింది -
    అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చోమని కాదు. వచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకొమ్మని.
    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  3. ఆచార్య ఫణీంద్ర గారు,

    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  4. వందనాలు ఫణీంద్రగారు!

    పద్యం చాల బాగుంది.....

    చిన్న చిన్న పదమ్ములు చేర్చి, అర్థ
    వంతమౌ భావముల కూర్చి, పంచి, మాకు
    స్ఫూర్తి కలిగించినాడవు, సుజన బంధు!
    రామకృష్ణమాచార్య! నా ప్రణతులివియె.


    ఫణీంద్రగారు! మీకు ఒక ఈ-మెయిల్ పంపాను, మీరు ఒకమారు చెక్ చేసుకుని, ప్రత్యుత్తరమివ్వరూ!

    ధన్యవాదాలు..:)

    రిప్లయితొలగించండి
  5. ఆచార్య ఫణీంద్రగారికి శ్రీలలిత నమస్కారములు. మీరు ఆటవెలది రాయడానికి చెప్పిన పధ్ధతి బాగుంది. తప్పక ప్రయత్నిస్తాను. ఒక విన్నపం.
    మీరు చంపకమాల వ్రాయడం చెప్పినప్పుడు నేను వ్రాసిన పద్యాన్ని సరిదిద్ది మెచ్చుకొన్నారు. ఆ ప్రోత్సాహముతో మరొకటి మీకు వ్రాసి పంపించాను. కాని ఆ తరువాత మీరు ఇప్పుడే బ్లాగ్ లో కనిపించారు. శ్రమ అనుకోకుండా నేను వ్రాసిన పద్యం సరి చేసి పెట్టగలరా?

    రిప్లయితొలగించండి