'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :
"జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే!"
ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 ఏప్రిల్ 2009
- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)
తండాలు గగూడి అకట
రిప్లయితొలగించండిదండా లెడుదురు జనులకు దయ "గొను" వారై
పిండాలు తినెడి కాకుల
జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే!
చండా లులుమన నేతలు
రిప్లయితొలగించండిఖండా లుగచే యజూడు ఖద్దరు దేశం
భాండా లేవీ రికడుపు
జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే!
రెండా మూడా విరివిగ
తండా లనుమా ర్చువీరు జనులకు చేటే
మండే కడుపులు ఆరవు
జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే!
ఆత్రేయ గారు!
రిప్లయితొలగించండిపద్యాలు బాగున్నాయి.
ముఖ్యంగా మొదటి పద్యం చాలా చాలా బాగుంది.
అభినందనలు!
- డా.ఆచార్య ఫణీంద్ర
ఆత్రేయ గారు!
రిప్లయితొలగించండిమొదటి పద్యం చాలా చాలా బాగుంది.
దండాలు పెట్టి పోదురు
రిప్లయితొలగించండినిండా గెలిచిన తదుపరి నిన్నే మరిచే
పిండారులు నాయకు లిట
జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే
ఎండలొ ఎన్నిక లొచ్చెను
రిప్లయితొలగించండిమెండుగ వరములు కురిసెను మేన్ ఫెస్టో ల్లో
నిండుగ ముంచెడి పార్టీ
ల్జెండాలే వేరు మరి ఎజెండా లొకటే.
హరి గారు! నరసింహ గారు!
రిప్లయితొలగించండిచక్కని పూరణలందించారు. పద్యాలు ధారాశుద్ధితో భావ రమ్యంగా సాగాయి.
మీ ఇరువురికీ నా అభినందనలు!
(అయితే మీకు నాదొక సూచన:
ఇంత ప్రతిభ కలిగి, మీరు అక్కడక్కడా పదాలలో వ్యవహార రూపాన్ని ప్రయోగిస్తున్నారు. భాష సరళమైనా, పదాలు గ్రాంథిక రూపంలో వాడితేనే, పండితులు హర్షిస్తారు. పద్యానికి గౌరవం లభిస్తుంది. చిన్న..చిన్న మార్పులే!...
’నిండా’ అనే బదులు ’నిండుగ’ అనవచ్చు.
’నిన్నే మరిచే’ బదులు ’నిను మరిచెడి ఆ’ అని వ్రాయవచ్చు.
’ఎండలొ’ బదులు ’ఎండను’ అనవచ్చు.-
*వీటికి సంబంధించిన టపా ఒకటి ఈ బ్లాగు ’ఫిబ్రవరి’ మాసం టపాలలో ఉంది. చూడండి-
**మీరు నన్ను తప్పుగా అనుకోవద్దని నా మనవి.)
ఆత్రేయ గారు! ఈ సూచనను మీరూ గమనించండి.
- డా.ఆచార్య ఫణీంద్ర
ఫణీంద్ర గారు
రిప్లయితొలగించండిమీ సూచనలు విలువైనవి, ఆచరణీయ మైనవి. చెప్పడానికి దయచేసి సందేహించ వద్దు. సూచనలకు ధన్యవాదాలు.
అయితే వాడుక పదాలు వాడడం ద్వారా పద్యాన్ని జనసామాన్యం లోకి తీసుకు వెళ్ళ గలమేమో ఆలోచించండి.
హరి గారు!
రిప్లయితొలగించండిమీరన్నది నిజమే! శ్రీశ్రీ-"సిరిసిరిమువ్వ శతకం", ఆరుద్ర- "ఇంటింటి పజ్యాలు" ...అలా వ్రాసినవే. అయితే అవి అక్కడక్కడ అని కాకుండా, ఆనాటి పద్య కవులపై తిరుగుబాటుగా - నిబద్ధతతో పూర్తిగా వ్యవహార భాషలో వ్రాసినవి. సాహిత్య లోకం వాటిని సరదా పద్యాలుగా స్వీకరించిందే తప్ప, సీరియస్ పద్య కవితలుగా అంగీకరించలేదు. సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి భాషా ప్రమాణాలను తగ్గించనక్కర లేదు. తిరుపతి వేంకట కవుల - "రాయబారం" పద్యాలు, కరుణశ్రీ - "పుష్ప విలాపం" పద్యాలు, జాషువ మరియు దాశరథి అభ్యుదయ, విప్లవ పద్యాలు మొదలైనవెన్నో జన సామాన్యంలోకి చొచ్చుకుపోయాయి. కావ్య గౌరవాన్ని కూడా పొందాయి.
- డా.ఆచార్య ఫణీంద్ర
నా పూరణ మీకు నచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు. మీరు చేసిన మార్పు బాగుంది.
రిప్లయితొలగించండిదయచేసి సెట్టింగ్సు లో వర్డ వెరిఫికేషనును తొలగించగలరు.
జెండాలను చేకొని మరి
రిప్లయితొలగించండితండాలుగ తరలి వచ్చు తమ్ముల్లారా
భండారము తెలిసి కొనుడు
జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే!
హరి గారు!
రిప్లయితొలగించండిపద్యం చాలా బాగుంది - అభినందనలు!
- డా.ఆచార్య ఫణీంద్ర
దండిగ వాగ్దానముల న
రిప్లయితొలగించండిఖండముగాఁ జేసి, గెలిచి ఘనసంపదలన్
మెండుగ సంపాదింతురు
జెండాలే వేరు - మరి అజెండా లొకటే!
'జెండాలే వేరు - మరి అ
జెండా లొకటే' యనెడి విశేష సమస్యన్
మెండైన ప్రతిభతోడ న
ఖండముగా పూర్తి చేయు కవులకు జేజే.
కంది శంకరయ్య గారు!
రిప్లయితొలగించండిమంచి పూరణనందించారు. అభినందనలు!
అలాగే -
పూరణ యొనరించిన కవి
వీర వరుల కందరికిని, ప్రియ పద్యములో -
మీరిక నా పక్షములో
చేరిటు, జేజేలనుటను - జేజే యనెదన్!
- డా.ఆచార్య ఫణీంద్ర
శీర్ణమేఖల-ఎంత,అందమైన పేరు. చిన్నప్పుడు స్చూల్లో ఏ తరగతో గుర్తు లేదు కాని - త్రోసిరాజో లేక ఉయ్యాల త్రోసిరాజో కోరుకొమ్మంచు - ఈ పద బంధం ఇప్పటికీ గుర్తె. ఈ పాఠ్యభాగం అంటె నాకు చాలా ఇష్టం. అందుకె అప్పటినుంచి దుర్యోధనుడు అంటె భారత కధా పరంగా వ్యతిరేక భావం ఉన్నా కాని ఏదో మూల ఓ చిన్న సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
రిప్లయితొలగించండి