12, జులై 2009, ఆదివారం

సంపాదకీయం ( జులై 2009 ) "

" సులువుగా పద్యం వ్రాయండి " శీర్షికలో ట్యూన్ కి పాట వ్రాసినంత సులువుగా పద్యం వ్రాయడమెలాగో నేర్పుతున్నాను. అయితే పాఠకుల నుండి ఆశించినంతగా స్పందన రాలేదు. బహుశః దానికి కారణం _ చాలా మందికి ట్యూన్ కి పాట వ్రాయడం కూడా ఎలాగో తెలియదేమో అన్న అనుమానం కలుగుతున్నది. అటువంటి వారి అవగాహనార్థం " ఆకలి రాజ్యం " సినిమాలోని ఒక పాట సన్నివేశం ఈ క్రింద ఇస్తున్నాను. అది చూచి మన " ఉత్పల మాల " ను కూడా అలాగే అభ్యాసం చేసి, మంచి పద్యాలు వ్రాస్తారని ఆకాంక్షిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకులు )

Aakali Rajyam-Kanne Pillavani Kannulunnavani

4 కామెంట్‌లు:

  1. Acharya garu,
    I donot think many people will have the bent of mind to write poems for tunes.
    Personally, I left telugu after 10th class.
    I am enthusiastic but not sure what level of knowledge you expect from people like me.
    I request you to show more examples , they could be our famous poems also, for us to develop the habit of that type of thinking

    రిప్లయితొలగించండి
  2. శాస్త్రి గారు,
    కాలేజీ లో తెలుగు నేర్చుకోవటం వేరు.
    ముఖ్యమైంది: భావము, భావుకత, దాన్ని పదాలలో వ్యక్తం చేసే నైపుణ్యం, భాష మీద, పదకోశం మీద కొంత పట్టు.
    ఇది కాక పూర్వకవుల పద్యాల్ని కొంతైనా అధ్యయనం చేయాలి. ఇవి చదివితే, మీరన్నట్టు ఆ type of thinking అలవడుతుంది.


    -భవాని

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రి గారు !
    నా పాఠాలు పద్యాలు వ్రాయాలన్న ఆసక్తి గల వారి కొరకే !
    మీకు ఉత్సాహం ఉంది అంటున్నారు. అయితే మీరు ఇంతకు ముందు నేను వ్రాసిన పాఠాల టపాలన్ని చదివితే, మీ స్థాయి వారికి కొంత ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు. అంత కన్న ముందు నా విన్నప మేంటంటే, మీరు వ్యాఖ్యలను తెలుగులో వ్రాయండి. లిపి ఆంగ్లంలో ఉన్నా ఫరవా లేదు.

    అమ్మా! భవాని గారు !
    శాస్త్రి గారికి పద్ధతి ప్రకారం సమాధానం వ్రాసి, నా పని సగం తగ్గించారు.
    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  4. శాస్త్రిగారు నేనూ పదవతరగతి వరకే తెలుగు నేర్చుకున్నాను. పద్యాలు రాయాలన్న తపన ఉండేది కానీ.. సులువుగా అవి రాయగలిగే మెళుకువ తెలియక, ఏ వ్యాకరణ పుస్తకాలు చదివి అర్ధం చేసుకుని ఆ విధానాన్ని ఆకళింపు చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను. ఈ బ్లాగుల పుణ్యమా అని పణీంద్ర గారి చలవ వల్ల ఆ మెళుకువలు తెలుసుకుంటున్నాను. మీరు కూడ ఇవి చదివి కాస్త సమయం వెచ్చించ గలిగితే తప్పకుండా మంచి పద్యాలు రాయ గలుగుతారు. ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి