5, జులై 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... ( జులై 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ !"

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 జులై 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

6 కామెంట్‌లు:

  1. అవధానంబులు చేయ నింపుగను తా అష్టావ ధానం బదే
    అవధానంబులు పెక్కు జేయుదురు ఈనాడాంధ్ర దేశంబు నన్
    అవధానంబులు జేతురిప్పుడిట పృఛ్ఛకుల్ సహస్రంబులున్
    అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ !

    రిప్లయితొలగించండి
  2. Hari gaaru !
    padyam baagundi.
    ayite, samasyaku bhaava samanvayam marinta spashtamgaa unte baagundedi.
    abhinandanalu !

    రిప్లయితొలగించండి
  3. స్తవనీయంబగు బౌండరీ లవె సమస్యాపూరణంబుల్ గదా
    వ్యవధానం బిడకుండు బౌన్సరు లసాధ్యంబౌ నిషిద్ధాక్షరుల్
    నవ లావణ్యఁపు బ్యాటు దత్తపదులన్ నర్తింపఁ జేయన్ భళీ
    యవధానం బొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్.

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్య గారు !
    అమృత గుళిక వంటి పద్యాన్ని అందించారు.
    అన్వయం అద్భుతంగా కుదిరింది.
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్య గారూ పద్యం అదుర్సు. చాలా బాగుంది.

    ఆచార్యా ఈ పాదము మత్తేభమని తెలుసుకోవడానికే నాకు ఓ గంట పట్టింది. ఇంకా నేను అక్కడిదాకా రాలేదు. అందుకని ఈ సారికి పూరించలేను. మీరు సమశ్యతో పాటు అది ఏపద్యపాదమో కూడా చెప్పచ్చుకదా..

    రిప్లయితొలగించండి
  6. కంది శంకరయ్య గారు, అద్భుతం!

    రిప్లయితొలగించండి