14, జులై 2009, మంగళవారం

" శలవు " కాదు _ " సెలవు "

" శలవు " కాదు _ " సెలవు "
--------------------------

బ్లాగులలో కొందరు " శలవు " అని వ్రాస్తున్నారు. అది తప్పు.
దానిని " సెలవు " అని వ్రాయాలి. అదే సాధు రూపం !
అలాగే, కొంత మంది ఈ శబ్దాన్ని పూర్తిగా తొలగి పోతున్నప్పుడే ప్రయోగిస్తారన్న అపోహలో ఉన్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు. తాత్కాలికమైన వీడుకోలుకు కూడా దీనిని వాడవచ్చు.
దీని అర్థం ఏమిటనుకొన్నారు ?
ఆజ్ఞ లేక అనుమతి.
సెలవు అంటే వీడుకోలు తీసుకొనేందుకు అనుమతి కోరడం అన్న మాట !

అందరూ తప్పుగా వ్రాసే మరొక పదం " అమాయికుడు ". దీనిని అందరూ " అమాయకుడు " అని వ్రాస్తారు, పలుకుతారు. ఇది తప్పు. " అమాయికుడు " సాధు రూపం.

డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

7 కామెంట్‌లు:

  1. ఏం పర్వాలేదు. అంతరూ అమాయకుడు అని వ్రాస్తే అదే ఒప్పు ప్రజాస్వామ్యం సైన్సు కాకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యం రూల్స్:)

    రిప్లయితొలగించండి
  2. ఆచార్యా, దయచేసి అమాయికుడు వ్యుత్పత్తి వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  3. చావా కిరణ్ గారు !
    నిజమే ! అందరూ " అంతరూ " అని వ్రాస్తే, ప్రజాస్వామ్యంలో అది కూడా చెల్లుబాటు అవుతుంది.
    ఇక భాషేమిటి ? భ్రష్టత్వమేమిటి ? కానీయండి.

    రిప్లయితొలగించండి
  4. రవి గారు !
    భాష పట్ల మీ ఆసక్తికి, అభిమానానికి అభినందనలు !
    " అమాయికుడు " తత్సమ శబ్దం. సంస్కృత భాషలో మాయ చేసే వాణ్ణి
    " మాయికుడు " అంటారు. " మాయకుడు " అనకూడదు.
    " మాయికుడు " కాని వాడు " అమాయికుడు ". అదీ వ్యుత్పత్తి !

    రిప్లయితొలగించండి
  5. ఉత్పత్తి..(వ్యుత్పత్తి నాలేమో)కన్నా ఉపయోగంలోంచీ అర్థం చేసుకోవడం సరైన పద్దతేమొ!

    రిప్లయితొలగించండి
  6. ఆచార్య ఫణీంద్ర గారు, ధన్యవాదాలండి.

    మహేష్ గారు, ఏపిల్ పండు పడ్డం చూసి, ఒకడికి తీసుకు తిందామనిపిస్తుంది, ఇంకొకడికి తీసుకెళ్ళి విత్తనం తీసి చెట్టు నాటుకుందామనిపిస్తుంది, మరొకడికి అసలు ఎందుకు కింద పడాలి? పైకెళ్ళచ్చుగా అనే ఆలోచనొస్తుంది. ఎవరికి ఏ రకమైన అర్థం కావాలంటే వాళ్ళు ఆ పద్ధతిలో వెతుక్కుంటారు కదండి?

    రిప్లయితొలగించండి