17, జులై 2009, శుక్రవారం

" ఆణిముత్యం" ... ( జులై 2009 ) "


" ఆణిముత్యం" ... ( జులై 2009 ) "

" విషయ సంకలనము విజ్ఞానమా ? కాదు !
ఇటుక వాము వేరు _ ఇల్లు వేరు !
అస్థి పంజరమ్ము అసలు దేహము కాదు !
ప్రత్తి వేరు _ నూలు పంచె వేరు !
"


మా గురువు గారు డా || నండూరి రామకృష్ణమాచార్య రచించిన పద్యం ఇది.
మానవుడు వివిధ విషయాలపై సమాచారాన్ని సేకరించి, మెదడులో దాచుకొన్నంత మాత్రాన _ అది అతడు సాధించిన విజ్ఞానంగా భావించలేము. ఆ సమాచారాన్ని అంతా తన ఇంగిత జ్ఞానంతో మెదడులో సమన్వయం చేసుకొని, అవసరానికి సత్ఫలితాలిచ్చేలా దానిని ప్రయోగించగలిగినప్పుడే అది అతడు సాధించిన విజ్ఞానంగా పరిగణించబడుతుందని గురువు గారు ఈ పద్యంలో ప్రబోధించారు. దీనికి రూఢిగా ఆయన మూడు ఉదాహరణాలను ఇచ్చారు.
1. మన దగ్గర ఇటుకలెన్నైనా ఉండవచ్చు. కాని వాటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి, మధ్యలో సిమెంటుతో సంధానిస్తూ, నివసించడానికి అనువుగా రూపొందించిన నిర్మాణాన్ని మాత్రమే ఇల్లు అంటారు.
2. అస్థి పంజరం మనిషి దేహంలో ఉండవచ్చు. కానీ అదే దేహమై పోదు. అందులో రక్త, మాంసాలను కూర్చి, జీవ లక్షణం తోడైనప్పుడే అది దేహమౌతుంది.
3. అలాగే, మన వద్ద కావలసినంత పత్తి ఉండవచ్చు. కాని దానిని కట్టుకోడానికి అనువుగా చక్కగా నేసినప్పుడే అది పంచె అవుతుంది.
ఆ విధంగానే మనం సేకరించిన సమాచారాన్ని ఉపయుక్తంగా మలచి, మెదడులో తీర్చి దిద్దుకొన్నప్పుడే _ అది విజ్ఞానమవుతుంది అని ఈ పద్య భావం.

7 కామెంట్‌లు:

  1. చక్కని చిన్న పద్యంలో విషయ పరిజ్ఞానాన్ని ఎలా వాడుకోవాలో సూచించారు. నిజమే విడివిడిగా ఎంత సమాచారమున్నా, దానిని ఒక పద్ధతిలో కూర్చుకోలేకపోతే ఎంత పరిజ్ఞానమున్నా ఉపయోగమేముంది? చక్కని పద్యం.

    రిప్లయితొలగించండి
  2. Wonderful message with high standards. But I couldn't understand how that 'skeleton' line can convey the suggested meaning. In rest of the 2 lines, Its the raw material which can be used to make the meaningful. But in the 'skeleton', blood & flesh are completely different & apart from bones. Please clarify... (I tried but could nt type in telugu using my fire fox browser)

    రిప్లయితొలగించండి
  3. వికాసం గారు !
    మనం సేకరించిన సమాచారానికి, మన ఇంగిత జ్ఞానాన్ని జోడించి సమన్వయం చేసుకొన్నప్పుడే అది విజ్ఞానమవుతుంది.
    ఇల్లు అన్నప్పుడు సిమెంటు, స్టీల్ మొ||వి ఆ ఇంగిత జ్ఞానం; సమాచారం ఇటుకలు.
    దేహం అన్నప్పుడు రక్త మాంసాలు ఆ ఇంగిత జ్ఞానం; అస్థి పంజరం సమాచారం.
    పంచె అన్నప్పుడు పత్తి సమాచారం; అవసరమైన మేర వాడే రంగులు మొ||వి ఇంగిత జ్ఞానం.
    ఎంత వరకు సరిగా వివరించానో మీరే చెప్పాలి.
    నా బ్లాగును ఫాలో అవుతున్నందుకు మీకు నా ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  4. రామిరెడ్డి గారు !
    మీకు నా ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  5. hmmm... వేమన పద్యాలనుదహరించే నాకు ఒక మంచి పద్యం పరిచయం చేసారు. బట్టీ పట్టేసా. :)

    రిప్లయితొలగించండి