'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :
" బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా! "
ఇది ’ ఆట వెలది ’ పద్యంలో మొదటి లేక మూడవ పాదంగా ఇముడుతుంది.
తెలుగు బ్లాగులను ప్రశంసించేలా పై పాదాన్ని ప్రయోగిస్తూ ఒక ’ ఆట వెలది ’ పద్యాన్ని పూరించండి.
పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)
బ్లాగు బ్లాగు! నా బ్లాగు టేగ్ లైనునే సంస్కరించి సమస్యగా ప్రయోగించారే! :)
రిప్లయితొలగించండిజాలమందు గొప్ప చాతుర్య మొప్పంగ
తెలుగు వారు వ్రాయు తేనె పలుకు
బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా
తెలుగు జిలుగు వెలుగు సులభముగను.
'కూడలం'త జూచి కడకు 'జల్లెడ' పట్టి
రిప్లయితొలగించండిచెప్ప దలచి నాను గొప్ప గాను
బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా
సర్వ గుణము లుండు చదివి చూడ
కవిత లల్లు బ్లాగు కథలల్లు బ్లాగులు
రాజకీయ గుట్టు రట్టు బ్లాగు
బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా
కూడలిని అడుగిడి చూడ తెలియు
కొత్త పాళీ గారు !
రిప్లయితొలగించండి" పురుషులందు పుణ్య పురుషులే వేరయా ! " అన్న వేమన పద్య పాద ప్రేరణతో ఇచ్చిన సమస్య అది.
మీ వ్యాఖ్య చదివాక, మీ బ్లాగు తెరచి, మీ ’ టాగ్ లైన్ ’ ను గమనించాను. బాగుంది.
మీ పద్యం మరీ మరీ బాగుంది. అభినందనలు !
హరి గారు !
రిప్లయితొలగించండిమీ పద్యాలు చాలా బాగున్నాయి. అభినందనలు !
అయితే ... భాష పై మమకారంతో రెండు దోషాలను వివరిస్తాను. సరిచేసి, భావిలో కూడా గుర్తుంచుకోండి.
మొదటి పద్యం మొదటి పాదంలో ప్రయోగించిన ’ ప్రాస యతి ’ లో ...
’ కూడలి ’ లో ’డ’ కారానికి ముందు అక్షరానికి దీర్ఘమున్నట్లే,
’ కడకు ’ లో కూడా ’డ’ కారానికి ముందు అక్షరానికి
దీర్ఘముండాలి. అప్పుడే ’ ప్రాస యతి ’ చెల్లుతుంది.
ఇక రెండవ పద్యంలో ’ రాజకీయ గుట్టు ’ మిశ్రమ సమాసం. " ఈ రోజుల్లో ఫరవాలేదులే ! " అంటే చెప్పలేను గాని, పండితులు హర్షించరు. ఇలాంటి సమాసాలు చేయకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం.
మీరు చాలా మంచి పద్య కవి. మీకు ఈ విషయాలు తెలియజెప్పాలనిపించింది.
పద్యాలు బాగున్నాయి సుమా ! మరొకమారు అభినందనలు !
అంతా బానే, అంతా బాగుంది కానీండి, మీ సమస్యా, దానికి తగిన పూరణలు. వందనం, అభివందనం, తకధిమితోం.
రిప్లయితొలగించండిఎందుకో చిలకమర్తివారి పద్యం ఒకటి గుర్తుకొస్తోంది.
తోటకూర దెచ్చి దొడ్డిలోన తరిగి
కుండలోన బెట్టి కుదురుగాను
క్రింద మంటబెట్ట వుడకకేంజేస్తుంది?
దాని కడుపుకాల ధరణిలోన
అని. అదండీ సంగతి. మరి వుంటాను. మళ్ళీ వస్తాను. ఈ మధ్య కవితలన్నీ " అద్భుతం " గా వుంటున్నాయి ఏమిటో ఈ మాయ.
అయ్యా ’ జలసూత్రం ’ గారూ !
రిప్లయితొలగించండిఅవును మరి ! మీకు ఒక చిన్న ’ సమస్యా పూరణం ’ లోనే
’ కాళిదాస కావ్య రసాలు ’, ’ చేమకూర చమత్కారాలు ’ పిండుకోవాలన్న అత్యాశ !
మాకంత పెద్ద ఆశలు లేవు మరి.
అసలే ఇంగ్లీషు మీడియం చదువులతో తెలుగు పద్యాలు వ్రాసే వారే కరువౌతుంటే, మీలాంటి పండితమ్మణ్యులు ఇలా బెదరగొడితే గాని, మీ తరువాతి తరంలో పద్యం నామ రూపాల్లేకుండా చేయ లేరు మరి !
కానీయండి ... ఇంకా విజృంభించండి.
ఎందుకంటే మీరాశించిన స్థాయి పద్య కవులను ఈనాటి ఇంగ్లీషు మీడియం విద్యార్థులనుండి తయారుచేయడం మీ కెలాగూ చేత కాదు.
రోడ్డెక్కితే గదా ఎత్తు పల్లాలలో డ్రైవ్ చేయడం ! రోడ్డే ఎక్కనివ్వకపోతే సరి !
ఏమంటారు ?
’ జల సూత్రం ’ వంశాంబుధీ సోమా !
రిప్లయితొలగించండిఅప్రతిమాన పండిత కవి భీమా !
అన్నట్టు ...
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
" కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ! "
" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ ! "
వంటి సమస్యలిచ్చినపుడు మీరెక్కడున్నారు స్వామీ ?
మీ పూరణలను మాకు కటాక్షించ లేదే !
సరే ! ఇప్పుడైనా ఈ సామాన్య సమస్యను అసామాన్యంగా పూరించి, మా బోంట్లకు వెలుగు చూపవచ్చు కదా !
యోగమున్నవారు జాగు చేయక తెల్గు
రిప్లయితొలగించండిబ్లాగు చదువ నేర్చు బాగు పడగ.
బ్లాగు లందు తెలుగు బ్లాగులే వేరయా!
ఫణి వరేణ్యు పలుకు భవ్యమయ్య!
వెనకటికి ఒకాయన మాతాత కౌపీనం ఆకాశమంత వుందని అన్నాట్ట. అది విని తట్టుకోలేని ఇంకొకాయన ఒరే మా తాత కౌపీనం కొంచెం చిరిగితే మీ తాత కౌపీనం అతుకెయ్యటానికి పనికొచ్చింది అన్నాడత. అలాగున్నది మన "ఆవు" (కౌ) ల పరిస్థితి.వాచామగోచరంగా ఉంటున్నవి ఈ మధ్య కైతల్లన్నీ. ఆ రసమేమిటి, పాకమేంఇటి, భావమేమిటి, యతులేమిటి, ప్రాసలేమిటి, శబ్దరత్నాకరాలేమిటి - ఒహటా రెండా - వెయ్యితలల ఆదిశేషువే దిగిరావాలి కిందకు. ఇక నేను కపిత్వము చెప్పెదను అని ఎక్కడయినా చెపితినా మాష్టారు ? ఉమ్మెతకాయలు తిన్నవారు ఎక్కువవుతున్నారు ఆవుల(కౌ) లోకంలో అని దీనిభావం. ఆ పైన కాకులు ముట్టని ఉప్పు పిండి అదేనండీ ఉప్పుమాకు తీసిపోకుండా తెగ అల్లుతున్నారు అని వాదించటమే.
రిప్లయితొలగించండిపొలములో నక్కలు కూసెగా
మనసులో భయమెంతో వేసెగా
పాలేరు యిట్టట్టె చూసెగా
గంగన్నా నీ ____ మోసెగా
లాగా ఉంటున్నవి మరి - ఏమి " చెప్పు "మందురు !
’ జల సూత్రం ’ వారి పై వ్యాఖ్యకు సమాధానంగా నా తదుపరి టపాను చదవండి
రిప్లయితొలగించండిఆచార్య గారు,
రిప్లయితొలగించండిప్రాస యతిలో ఈ నియమం గురించి నాకు తెలియదు. సరి చేసుకుంటాను. దోషాలు వివరించి నందుకు కృతఙ్ఞతలు.
జల సూత్ర కల్మషాలు మీ సంకల్ప బలానికి అడ్డంకులు కారాదని కోరుకుంటున్నాను.
మా అమ్మాయి "స్వాతి" పూరణ-
రిప్లయితొలగించండిపూవులందు మల్లెపూలు వేరైనట్లు
భాషలందు తెలుగు భాష వోలె
బ్లాగులందు తెలుగు బ్లాగులు వేరయా
శంక వీడుమయ్య శంకరయ్య!
నా పూరణ -
లలిత భావ పద విలాసాంచితానేక
విషయ సంగ్రహణ వివేచనముల
బ్లాగులందు తెలుఁగు బ్లాగులు వేరయా
తెలుఁగుదనము దిశల వెలుఁగఁ జేయ.
చింతా రామకృష్ణారావు గారు !
రిప్లయితొలగించండికంది శంకరయ్య గారు !
మీ వంటి సీనియర్ పద్య కవులు కూడ పూరణలు చేస్తూ,
నవ్య కవులకు మార్గ దర్శకులుగా నిలుస్తూ,
నా బ్లాగుకు బలం చేకూరుస్తున్నారు.
మీకు అనేకానేక ధన్యవాదాలు !
హరి గారు !
రిప్లయితొలగించండిమా గురువు గారి ఆశీర్వాద బలం, మీవంటి వారి అండ ఉన్నంత వరకు ...
నిస్వార్థంగా సాగే నా సంకల్ప యాత్రకు ఎటువంటి భంగం వాటిల్లదు.
మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు !
అమ్మా స్వాతి !
రిప్లయితొలగించండిఎంత చక్కని పద్యం చెప్పావు తల్లీ !
ఆ రెండవ పాదాన్ని ...
" దేశ భాషలందు తెలుగు వోలె " అని మారిస్తే, మరింత అందగిస్తుంది కదూ !
మీ నాన్న గారి పేరు నిలబెడుతున్నావమ్మా !
నీకు నా ఆశీస్సులు !
blaagu blaagu naduma bahuLa vyatyaasammu
రిప్లయితొలగించండిniSita dRushTi vaaTi niggu tElchu
blaagulandu telugu blaagulu vErayaa
telugu danamu yokka teepi delupu
నిరంజన్ కుమార్ గారు !
రిప్లయితొలగించండిపద్యం బాగుంది - అభినందనలు !
aacharya garu telugu typing yelaa cheyaali
రిప్లయితొలగించండినిరంజన్ కుమార్ గారు !
రిప్లయితొలగించండిఎన్నో ఉపకరణాలున్నాయి. సులభమైనది ( నేను అనుసరిస్తున్నది ) చెప్పుతాను.
ఇంటర్నెట్ నుండి www.baraha.com అని టైప్ చేసి, ఉచితంగా వివిధ భాషల సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
తెలుగు ఆప్షన్, యూనికోడ్ ఆప్షన్ ను క్లిక్ చేసి పెట్టుకొని, తెలుగు లిపిని ఇంగ్లిషులో టైప్ చేస్తూ పోతే స్క్రీన్ పై తెలుగులో అచ్చవుతుంది. ఉదాహరణకు :
" వస్తున్నాడు " కొరకు vastunnaaDu అని టైప్ చేయాలి.
ఏవైనా సందేహాలు వస్తే, Help ను క్లిక్ చేసి చూసుకోవచ్చు.
మ్యాటర్ అంతా టైప్ చేసాక, copy కాని, cut కాని చేసి, కావలసిన చోట paste చేసుకోవాలి.
o.k. నా ? All the best !
నిరంజన్ కుమార్ గారు !
రిప్లయితొలగించండిసీనియర్ బ్లాగర్ గా ప్రసిద్ధి గాంచిన ’ జ్యోతి ’ గారు - తెలుగు బ్లాగుల రూప కల్పన, నిర్వహణ, తెలుగు ఫాంట్ల టైపింగ్ వివరాలు మొదలైన అనేక విషయాలను సవిస్తరంగా వివరించేందుకు ’ బ్లాగు గురువు ’ అనే ఒక బ్లాగునే నిర్వహిస్తున్నారు. బ్లాగు లోకానికి ఒక విశిష్ట సేవగా ఆ విదుషీమణి నిర్వహిస్తున్న ఆ బ్లాగును చూస్తూ ఉండండి. అది మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.