9, సెప్టెంబర్ 2009, బుధవారం

ఇదండీ ఈయన గారి సంస్కారం !

తెలుగు బ్లాగు మిత్రులారా !
మీకు తెలుసు - ఈ బ్లాగు ద్వారా కొత్తగా పద్యాలు వ్రాయడంపై ఆసక్తి గల వారి కోసం, సులభంగా పద్యాలు వ్రాసే విధానం బోధిస్తూ, అభ్యాసం కొరకు సమస్యల నిచ్చి పూరించమని నేను కోరుతున్న సంగతి. ఆ పరంపరలో భాగంగా, ఈ మాసం, తెలుగు బ్లాగులను ప్రశంసిస్తూ పూరించమని, " బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా ! " అన్న సమస్య నిస్తే, మన కవి మిత్రులు తమకు తోచిన రీతిలో పూరణలను అందించారు. ఆ పూరణలను చూసి, ఎవరో ’ జల సూత్రం ’ వారట - బ్లాగు నిర్వాహకుడనైన నన్ను, పూరణలను చేసిన కవులను వెటకారం చేస్తూ ఇలా వ్యాఖ్య చేసారు -

[Jalasutram చెప్పారు...

అంతా బానే, అంతా బాగుంది కానీండి, మీ సమస్యా, దానికి తగిన పూరణలు. వందనం, అభివందనం, తకధిమితోం.

ఎందుకో చిలకమర్తివారి పద్యం ఒకటి గుర్తుకొస్తోంది.

తోటకూర దెచ్చి దొడ్డిలోన తరిగి
కుండలోన బెట్టి కుదురుగాను
క్రింద మంటబెట్ట వుడకకేంజేస్తుంది?
దాని కడుపుకాల ధరణిలోన

అని. అదండీ సంగతి. మరి వుంటాను. మళ్ళీ వస్తాను. ఈ మధ్య కవితలన్నీ " అద్భుతం " గా వుంటున్నాయి ఏమిటో ఈ మాయ.
September 9, 2009 6:01 AM ]

ఆ వ్యంగ్యానికి నేనూ వ్యంగ్యంగానే ఇలా సమాధానమిచ్చాను.

[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

అయ్యా ’ జలసూత్రం ’ గారూ !
అవును మరి ! మీకు ఒక చిన్న ’ సమస్యా పూరణం ’ లోనే
’ కాళిదాస కావ్య రసాలు ’, ’ చేమకూర చమత్కారాలు ’ పిండుకోవాలన్న అత్యాశ !
మాకంత పెద్ద ఆశలు లేవు మరి.
అసలే ఇంగ్లీషు మీడియం చదువులతో తెలుగు పద్యాలు వ్రాసే వారే కరువౌతుంటే, మీలాంటి పండితమ్మణ్యులు ఇలా బెదరగొడితే గాని, మీ తరువాతి తరంలో పద్యం నామ రూపాల్లేకుండా చేయ లేరు మరి !
కానీయండి ... ఇంకా విజృంభించండి.
ఎందుకంటే మీరాశించిన స్థాయి పద్య కవులను ఈనాటి ఇంగ్లీషు మీడియం విద్యార్థులనుండి తయారుచేయడం మీ కెలాగూ చేత కాదు.
రోడ్డెక్కితే గదా ఎత్తు పల్లాలలో డ్రైవ్ చేయడం ! రోడ్డే ఎక్కనివ్వకపోతే సరి !
ఏమంటారు ?
September 9, 2009 7:00 AM ]

[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

’ జల సూత్రం ’ వంశాంబుధీ సోమా !
అప్రతిమాన పండిత కవి భీమా !
అన్నట్టు ...
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
" కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ! "
" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ ! "
వంటి సమస్యలిచ్చినపుడు మీరెక్కడున్నారు స్వామీ ?
మీ పూరణలను మాకు కటాక్షించ లేదే !
సరే ! ఇప్పుడైనా ఈ సామాన్య సమస్యను అసామాన్యంగా పూరించి, మా బోంట్లకు వెలుగు చూపవచ్చు కదా !
September 9, 2009 7:21 AM ]

వ్యంగ్యంలో కూడా నా లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెబుతూ, ఈనాటి ఇంగ్లీష్ మీడియం చదువుల కాలంలో పద్య కవిత్వంపై ఆసక్తి గలవారిని ప్రోత్సహించ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పాను.
ఇతరులపై అలవోకగా వ్యంగ్యాన్ని ఒలకబోసిన ’ జల సూత్రం ’ వారు తనపై వ్యంగ్యాన్ని ప్రయోగిస్తే మాత్రం ఓర్చుకోలేక పోయారు. పొంతన లేని ఉపమానంతో ఆయన ఆక్రోశాన్ని ఎలా వెళ్ళగ్రక్కారో చూడండి.

[Jalasutram చెప్పారు...

వెనకటికి ఒకాయన మాతాత కౌపీనం ఆకాశమంత వుందని అన్నాట్ట. అది విని తట్టుకోలేని ఇంకొకాయన ఒరే మా తాత కౌపీనం కొంచెం చిరిగితే మీ తాత కౌపీనం అతుకెయ్యటానికి పనికొచ్చింది అన్నాడత. అలాగున్నది మన "ఆవు" (కౌ) ల పరిస్థితి.వాచామగోచరంగా ఉంటున్నవి ఈ మధ్య కైతల్లన్నీ. ఆ రసమేమిటి, పాకమేంఇటి, భావమేమిటి, యతులేమిటి, ప్రాసలేమిటి, శబ్దరత్నాకరాలేమిటి - ఒహటా రెండా - వెయ్యితలల ఆదిశేషువే దిగిరావాలి కిందకు. ఇక నేను కపిత్వము చెప్పెదను అని ఎక్కడయినా చెపితినా మాష్టారు ? ఉమ్మెతకాయలు తిన్నవారు ఎక్కువవుతున్నారు ఆవుల(కౌ) లోకంలో అని దీనిభావం. ఆ పైన కాకులు ముట్టని ఉప్పు పిండి అదేనండీ ఉప్పుమాకు తీసిపోకుండా తెగ అల్లుతున్నారు అని వాదించటమే.

పొలములో నక్కలు కూసెగా
మనసులో భయమెంతో వేసెగా
పాలేరు యిట్టట్టె చూసెగా
గంగన్నా నీ ____ మోసెగా

లాగా ఉంటున్నవి మరి - ఏమి " చెప్పు "మందురు !
September 9, 2009 6:52 PM ]

ఇంతా చేసి ఈయన గారికి కవిత్వమే కాదు, కపిత్వం కూడా చేత కాదట. కాని కవులను మాత్రం ’ పశువులు ’ ( ఆవులు - ’ కౌ ’ లు ) అని తిడుతాడట. కవిత్వం నచ్చితే ప్రశంసించడం, నచ్చక పోతే సంస్కరించుకోవడానికి తగిన సలహాలివ్వడం, లేదంటే మిన్నకుండడం - రసజ్ఞుల సంస్కారం. అవేవీ చేత కాక పోయినా, " ఉమ్మెత్త కాయలు తిన్న వారు ", " కాకులు ముట్టిన ఉప్పు పిండి " అంటూ తిట్ల పురాణం మాత్రం ఈయనకు చేతనౌతుంది.
చివరలో " చెప్పు " ను గమనించారా ? - ఇదీ ఈయన గారి సంస్కారం ! నలుగురిలో ఈ కుసంస్కారిని ఎండగడుతూ
ఇదంతా టపాగా ఎందుకు అందిస్తున్నానంటే - నాతోబాటు నా ఈ బ్లాగులో అడుగు పెట్టిన నా అతిథులైన కవి మిత్రులను కూడా తిడుతుంటే, మిన్నకుండడం అమానుషం కాబట్టి.
- డా. ఆచార్య ఫణీంద్ర

8 కామెంట్‌లు:

  1. ఫణీంద్ర గారు, ఇలాంటి ఊసరవెల్లులు బ్లాగుల్లో అత్యంత సహజం.. ఇదో తుత్తి జనాలకు. ఎవరి ఆనందం వారిది. ఇష్టం లేకపోతే అయిష్టతను వ్యక్తపరచవచ్చు కానీ వీరికి ఎందుకు అయిష్టతో తెలియదు.

    మీకు అప్పుడెప్పుడో దిన్నెల వారి కామెంట్ గుర్తుకొచ్చిందేమో అనుకున్నా.

    రిప్లయితొలగించండి
  2. అకటా :-)

    మొత్తానికి, కవులు కంపు కంపుగా తిట్టుకున్నా ఇంపుగానే ఉంటుందన్నమాట. ఆ ఎగతాళి చేసినాయన 'నన్ను కవినన్న వాడ్ని కత్తితో పొడుస్తానం'టూ ఎంత హంబుల్ బుల్ పిట్టలా కనిపినే ప్రయత్నం చేసినా, ఆయనా ఆషామాషీ వ్యక్తిలా అనిపించటంలా ఆ రాసిన పద్ధతి చూస్తుంటే.

    మన్లో మాట - 'జలసూత్రం' వారి శైలి చూస్తుంటే ఆయన బ్లాగ్లోకంలో తన అసలు పేరుతోనూ ప్రసిద్ధి చెందినోడే అనిపిస్తుందేం చెప్మా!

    రిప్లయితొలగించండి
  3. అదినేనే,ఇది నేనే,అన్నీ నేనే - కాబట్టి ఆ చింత వదిలెయ్యవచ్చు - మీకు వ్యంగ్యం కనపడింది బానే ఉంది.ఎక్కడకనిపించిందో కానీ,అది మిమ్మల్నే అన్నానని అని ఎందుకు అనుకుంటున్నారో అర్థంకావట్లా. అది అన్నది ఇతరులని,కొత్తవారిని. మిమ్మల్ని ,ఇక్కడ రాసిన వారిని అన్నానని భావిస్తే నేనేమీ చెయ్యలేను. ఒకసారి ఆవేశము,కావేషము పక్కనెట్టి తీరిగ్గా మళ్ళీ చదువుకోండి మగానుబావా . మీరన్నమాటలకు, నేనన్నమాటలకు ఎంత తేడా ఉన్నదో చూడండి. కావాలంటే ఇంతకంటే చతుర్లకు సిద్ధమయిపోవచ్చు

    రిప్లయితొలగించండి
  4. ఈ వాద ప్రతి వాదనలు పక్కన పెడితే నాకు మీ ప్రయత్నం చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఎప్పటి నుండో పద్యాలు రాయాలని కోరిక. ఇకనుండీ మీ బ్లాగు ద్వారా ఆ కోరిక తీర్చుకుంటాను.

    @జలసూత్రం వారు : మీ వ్యాఖ్యలు కాస్త నొప్పించే విధంగా ఉన్నాయని పించిది.

    రిప్లయితొలగించండి
  5. " అంతా బానే, అంతా బాగుంది కానీండి, మీ సమస్యా, దానికి తగిన పూరణలు. వందనం,
    అభివందనం, తకధిమితోం. " - 1

    " మీకు వ్యంగ్యం కనపడింది బానే ఉంది.ఎక్కడకనిపించిందో కానీ,అది మిమ్మల్నే అన్నానని అని ఎందుకు అనుకుంటున్నారో అర్థంకావట్లా. అది అన్నది ఇతరులని,కొత్తవారిని. మిమ్మల్ని ,ఇక్కడ రాసిన వారిని
    అన్నానని భావిస్తే నేనేమీ చెయ్యలేను. " - 2

    భాస్కర రామిరెడ్డి గారు !
    మీరన్నది నిజమే ! ఇది ఊసరవెల్లి లక్షణమే !
    పైగా తానన్నది ఇతరులని, కొత్తవారినట !
    ఇతరుల పైనైనా నోరు పారేసుకోడానికి ఎవరిచ్చారు అధికారం ?
    ఇక కొత్తవారినయితే - సహృదయంతో ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి - అదీ సంస్కారం !
    సరేలెండి ! అది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు !
    మీరు చూపిన సహానుభూతికి మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. అబ్రకదబ్ర గారికి,
    రాజ శేఖరుని విజయ శర్మ గారికి -
    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  7. సంస్కారం - హ్మ్మ్- :) బాగుంది. ఊసరవెల్లికి సంస్కారం లేకపోవటమే ? ఎంత మాట ఎంతమాట... :) ఒకవేళ మీ మత్తయి సువార్త వల్ల లేదని అనుకున్నా నేర్పే స్థోమత ఒకరికుందని అనుకోను. రాసింది అర్థం చేసుకోకుంటారేమో అనుకున్నా. ప్రతీదానికి ఆవేశం, అపార్థమే కానీ పస లేదని, కొన్ని పసందు మాటలు - అదేనండీ చిన్నమాటల్లో చెపుతాను. ఈ ఉప్పుమా అన్నా అర్థం అయితే సంతోషం. దీన్ని కూడా పొంతన లేని ఉప్పుమా అంటారేమో. :) జాగ్రత్తగా చదివితే అసలు విషయం అర్థమవుతుంది. అప్పటికీ అర్థంకాలేదంటే చెప్పండి నేనే మళ్ళీ వివరిస్తాను. ఇందులో , అంటే ఈ కామెంటులో కానీ, ఇతర కామెంటులో కానీ వెటకారమూ లేదూ,ఎగతాళీ లేదు. ఆ ఉద్దేశమే ఉంటే ఇంతవరకు రానిచ్చే వాడినీ కాదు.

    సరే అందుకోండి మరి -

    రోజూ కొబ్బరి పీచుతో చెర్లో దిగేసి బరుకుతూ ఉండటం మూలాన ఒంటి మీదున్న బొచ్చు ఊడిపోయి, స్వేద గ్రంధాలు బయల్పడి శరీరానికి పైత్యం ప్రకోపించి నెమరు వేసే సమయంలో వాంతి అయ్యి బయటపడిన కవితల, పద్యాల సంగతీ నేను మాట్టాడింది. ఇక వాంతి చేసుకున్న ఆవుల గురించి చెప్పేదేముంది? వాసన తప్ప :) . ఆ వాంతి వాసన కూడా కొందరికి ఇంపుగానే వుండి చప్పట్లు ఎక్కువవుతున్నాయి అని ఊసరవెల్లి వారి అభిప్రాయం. :)

    ప్రోత్సాహాల సంగతి నేను చూసుకుంటాను కానీ, ఒక్క విషయం చెబుతా - సహానుభూతులు అవసరమయితే ఫరవాలా, అవే జీవాధారం అయితే కష్టం సుమండీ. సారాంశం అర్ధమయితే సంతోషం. ఆ పండితమ్మన్యులు శ్రీ రామకృష్ణమాచార్యుల వారి ఆత్మకు నిజమయిన శాంతి కలుగుగాక.

    PS - ఇంతకుముందు రాసిన ఇదే కామెంటును తొలగించారు కాబట్టి, ప్రపంచానికి ఎలా వున్నా, మనసు ఎంత ____తమో తెలుస్తోంది. :) . అచ్చంగా మీరు చేసిన పనిలాటిదే. మీలాగునే,అన్ని కామెంట్లు, నా ఈ కామెంటు కూడా ఒక బ్లాగు తెరిచి పోష్టు చెయ్యనూవచ్చు. కూడలిలో కనపడేటట్టు చెయ్యనూ వచ్చు. :)

    రిప్లయితొలగించండి
  8. మీ కుసంస్కారం నన్ను, నాతోటి బ్లాగు మిత్రులను దాటి - పరమ పవిత్ర హృదయులు, మహాకవి, దివంగతులైన మా గురువు గారిని కూడా తాకే సరికి - మనసు వికలమై, తట్టుకోలేక మీ వ్యాఖ్యను తొలగించాను. మా గురువు గారికి ఆంధ్ర దేశంలో లక్షలాది అభిమానులున్నారు. వారందరి దృష్టిలో కూడా మీరు పలచన అవ్వాలని కోరుకొంటే ఆ వ్యాఖ్యను అలాగే ఉంచుతాను. ఇక ముందు మాత్రం మీ వ్యర్థ ప్రలాపాలకు నా బ్లాగులో స్థానం లేదు. నిరభ్యంతరంగా మీ బ్లాగులో మిమ్మల్ని మీరు ఎండ గట్టుకోవచ్చు.

    రిప్లయితొలగించండి