21, జులై 2010, బుధవారం

డా. దాశరథి పై డా. సి.నా.రె. వ్రాసిన స్తుతి పద్యాలు

ఈ మాసం పద్య కవిత ( జులై 2010 )




























దాశరథీ! మనోజ్ఞ కవితా శరధీ! శరదిందు చంద్రికా
పేశల కావ్య ఖండముల పిండిన నీ కలమందునన్ మహో
గ్రాశనిపాతముల్ వెలయు నౌర! మహేశుని కంటిలో సుధా
రాశి తరంగముల్, కటు హలాహల కీలలు పొంగినట్లుగాన్!

నా తరుణ కావ్య లతిక లానాడు పైకి
ప్రాక లేక దిక్కులు సూడ, నీ కరాలు
సాచి, లేత రేకులకు కెంజాయ లద్ది,
మించు పందిళ్ళ పైకి ప్రాకించినావు!

రచన : డా. సి. నారాయణ రెడ్డి



సేకరణ : డా. ఆచార్య ఫణీంద్ర

( 22 జులై - డా. దాశరథి గారి జయంతి సందర్భంగా ... )

7 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. సి.నా.రె. పద్యాలు వ్రాసేవారని విన్నాను గానీ చదివే భాగ్యం అబ్బలేదింతదాకా. మచ్చుకి రెండి రుచి చూపించారు ధన్యవాదాలు ఫణీంద్ర గారూ.

    రిప్లయితొలగించండి
  3. శశిధర్ గారు!
    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  4. ఆత్మీయులు శ్రీ ఆచార్య ఫణీంద్ర గారికి
    నమస్సులు!

    బహుకాలానికి మళ్ళీ మీతో ఈ విధంగా సంభాషించటం వీలయినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది.

    దాశరథి గారిపై డా. నారాయణరెడ్డి గారు చెప్పిన ఎంతో అందమైన పద్యం మీరు ఉదాహరించిన "జలపాతం" కావ్యంలో ఆ పద్యాలకు ముందే ఉన్నది:

    తెలగాణమ్ము తమఃకవాటముల బందీయైన నిశ్శబ్దరా
    త్రులలో మేల్కొని కోటితమ్ములను మేల్కొల్పన్ మహో
    జ్జ్వలకాంతిస్ఫురదభ్రగీతికలు అభ్రమ్మంటగా పాడి తె
    ల్గులలో వెల్గులు నాటినట్టి కవితాలోకప్రభానీరధీ!

    అని. ప్రబంధపద్యాలకు సాటి నిలిచే శ్లేషానుప్రాణితమైన రూపకాలంకారం ఇది. కవి ధారాశుద్ధికి, భావయుక్తికి మేలైన నిదర్శనం.

    "జలపాతం" చదివానే కాని, ప్రతి నా వద్ద లేదు. పద్యాన్ని కేవలం జ్ఞాపకాధారితంగా ఉదాహరించాను. ఏమన్నా వ్యత్యాసా లున్నాయేమో చూసి చెప్పాలి.

    మీ బ్లాగు చాలా బాగున్నది. మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు!

    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  5. మన్నించాలి!

    తెలగాణమ్ము తమఃకవాటముల బందీయైన నిశ్శబ్దరా
    త్రులలో మేల్కని, కోటి"తమ్ము"లను మేల్కొల్పన్ మహో
    జ్జ్వలకాంతిస్ఫురదగ్నిగీతికలు అభ్రమ్మంటగా పాడి తె
    ల్గులలో వెల్గులు నాటినట్టి కవితాలోకప్రభానీరధీ!

    అని ఉండాలనుకొంటాను.

    రిప్లయితొలగించండి