'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
చాలా రోజులు ఈ శీర్షికను నిర్వహించడంలో ఆటంకం ఏర్పడినందుకు మన్నించండి. మళ్ళీ ఇదివరకులాగే ఈ శీర్షికను విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తూ ...
ఈ మాసం సమస్య :
" కోడిని కరకర నమిలె కోడలమ్మ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)
క్రొత్త కోడళు వచ్చిన అత్తఁజేసె
రిప్లయితొలగించండివేడి వేడి పకోడీలు వింటరందు
పడక గది వీడి బయటకు వచ్చి, ఆ ప
కోడిని కరకర నమిలె కోడలమ్మ!
వింటర్ (Winter) + అందు = వింటరందు
అత్త గయ్యాళి; కోడలు కన్ని పనులు
రిప్లయితొలగించండిచెప్పి చేయించెఁ దినుటకు చెడిన యన్న
మిడగఁ దినకున్న చాటుగా మగఁడొసఁగు ప
కోడిని కరకర నమిలె కోడలమ్మ!
కొత్త కోడలు గనియెను కూత వెట్టు
రిప్లయితొలగించండికోడిని; కరకర నమిలె కోడలమ్మ
పళ్ళనల కోపగించుచు,పతిని గూడి
మధువులం గ్రోలుఁ దన కార్యభంగమంద.
సత్యనారాయణ గారు!
రిప్లయితొలగించండిశంకరయ్య గారు!
రవి గారు!
మీ మువ్వురి పూరణలు బాగున్నాయి.
ధన్యవాదాలు!
నా పూరణ :
రిప్లయితొలగించండిమేడ మిద్దెల కట్నాల మేటిగ కొని
వచ్చినట్టి కోడలి కత్త ముచ్చట పడి
వేడి వేడిగా వేయించి ప్రేమనిడ, ప
కోడిని కరకర నమిలె కోడలమ్మ!