'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ప్రతి నెలా ఈ శీర్షిక కింద ఒక సమస్య ఇచ్చి పూరణలను ఆహ్వానిస్తామని లోగడ తెలియజేశాను.
ఫిబ్రవరి నెలలో ఇచ్చిన సమస్య , దానికి వచ్చిన పూరణలు ఇలా ఉన్నాయి.
సమస్య : సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్ !
జిగురు సత్యనారాయణ గారి పూరణ :
ఆకృతి దాల్చగ కూటమి
ఆ కలన సమయము వచ్చినంత తెరాసా
కైకొనెను పెక్కు సీట్లన్ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!!
ఆత్రేయ గారి పూరణ :
పైకము, పదవులు చాలక
శోకించెడి రైతుల వ్యధ చూడక రాజుల్
మైకున అరచిరి ఓటిడ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!
సంపాదకుని ( డా.ఆచార్య ఫణీంద్ర ) పూరణ :
నాకిడవలె పలు సీట్లని,
లేకున్నను పొత్తులింక లేవని చెప్పెన్
ఆ కే.సీ.ఆర్. బాబుకు -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!
మార్చ్ మాసంలో మరొక కొత్త సమస్యతో మళ్ళీ కలుద్దాం.
- సంపాదకుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి