6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సులువుగా పద్యం వ్రాయండి

పద్యం వ్రాయడమంటే 'ఛందస్సు', 'గణాలు', 'యమాతారాజభానస', 'నజభజజజర'- అబ్బో! పెద్ద గోల అనుకోవడం సహజం. కాని ఆ బాధలేమీ లేకుండా పాట వ్రాసినంత హాయిగా, ఆటపట్టులా, అలవోకగా పద్యాలల్లే మార్గాన్ని ఈ శీర్షిక ద్వారా ప్రతి నెలా ఒక చిన్న'లెస్సన్' తో నేర్పించబోతున్నాను. ఆసక్తి గల వారు నేర్చుకొని పద్యకవులుగా రూపొందవచ్చు.
వచ్చే నెలలోనే ప్రారంభం. ఈ లోపు ముందుగా మానసికంగా సిద్ధం కండి.

4 కామెంట్‌లు:

  1. అప్పుడే మాకళ్ళల్లో కాయలు కాస్తున్నాయండి.
    -సత్తిబాబు.

    రిప్లయితొలగించండి
  2. కళ్ళలో కాయల సంగతేమో గానీ, కవిత్వంలో కాయలను పళ్ళుగా మార్చే పూచీ నాది. ముందుగా మాత్రల లెక్కతో హాయిగా పాటలను వ్రాయడం అలవాటు చేసుకోండి. కాస్త యతి,ప్రాసల గురించి తెలుసుకొని పాటల్లో వాటిని ప్రయోగిస్తూ అభ్యాసం చేయండి. పద్యమయినా, పాటైనా, ఆ మాటకొస్తే ఏ కవితైనా- మంచి భావుకతతో, మంచి మంచి పద ప్రయోగాలతో సాగాలి. ఈ నెల రోజుల్లో వాటిపై అవగాహన పెంచుకోండి. ముందు కవి అయ్యే లక్షణాలు మీలో ఉంటే, మిమ్మల్ని మంచి పద్య కవులుగా మార్చే బాధ్యత నాది.
    - డా. ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి