19, జూన్ 2009, శుక్రవారం

సంపాదకీయం ... (జూన్ 2009 )

" ఆధ్యక్ష్యము " సాధు రూపమే !

పనుల ఒత్తిళ్ళ వలన ఒక నెల విరామం తరువాత ఈ బ్లాగు నిర్వహణను తిరిగి చేపట్టాను. పాఠకులను నిరీక్షించేలా చేసినందుకు మన్నించగలరు.
ఎప్పటిలాగే "సమస్యను పరిష్కరించండి" , "ఆణిముత్యం" , "సులువుగా పద్యం వ్రాయండి" వంటి శీర్షికలను ఈ వరకే అందించడం జరిగింది. ఇంకా "ఈ మాసం పద్య కవిత" , "వార్తా విశేషం" వంటి శీర్షికలను త్వరలో అందించగలను. అయితే "ఈ మాసం పద్య కవిత" శీర్షికకు ఔత్సాహికులెవరూ పద్య కవితలను పంపక పోవడం విచారకరం. మంచి పద్య కవితలు ( పాతవైనా సరే ) పద్య కవులు dr.acharya_phaneendra@in.com కు mail చేస్తే ప్రచురించగలను. పద్య కవితా వ్యాప్తికి అందరూ నడుము కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ మాసం "సమస్యను పరిష్కరించండి" లో ఇచ్చిన సమస్య _ " కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ".
ఈ సమస్యకు ఒక వారం రోజుల పాటు పూరణలు రాకపోయేసరికి కవులు అందులోని కిటుకును పట్టుకొన్నారో లేదో అని సందేహంలో పడ్డాను. కాని తరువాత "కంది శంకరయ్య" గారు , "హరి దోర్నాల" గారు చక్కని పూరణలను అందించారు. వారికి నా అభినందనలు.
అయితే , శంకరయ్య గారు , హరి గారు సమస్యను _ " కసభాధ్యక్షతను పొందె కాంతామణియే " అని మార్చి పూరించారు. రెండింటి భావం ఒకటే అయినా ,
వారు "ఆధ్యక్ష్యము" సాధు రూపం కాదనుకొని మార్చారా? అన్న అనుమానం కలుగుతున్నది. అలా అయితే ఇది చర్చనీయాంశమే. "ఆధ్యక్ష్యము" అన్న పదం "సూర్యరాయాంధ్ర నిఘంటువు"లో ఉంది. "అధ్యక్షత్వము" అని దానికి అర్థం పేర్కొనబడింది. ఈ విషయాన్ని గ్రహించ వలసిందిగా కోరుతున్నాను.
మరింత మంది ఈ బ్లాగులో పాలు పంచుకొని , పద్య కవితా వ్యాప్తికి , భాషాభివృద్ధికి దోహదపడాలని వేడుకొంటున్నాను.

_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

4 కామెంట్‌లు:

  1. శ్రీ ఆచార్య ఫణీంద్ర గారూ, అధ్యక్షము, అధ్యక్షత సమానార్థకాలే. ఆందులో అనుమానం ఇసుమంతైనా లేదు. నేను ఉదయాన్నే మీ బ్లాగులో సమస్యను ఒకసారి చూసి, స్కూల్లో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆ పద్యాలు రాసి మరునాడు పంపిచాను. పంపే సమయంలోనైనా ఒకసారి మీరిచ్చిన సమస్యను సరిగా గమనించాల్సింది. పొరపాటు నాదే. ఆ పద్యాలు రాస్తున్నప్పుడు నా మనస్సులో మీరు "సభాధ్యక్షతను పొందె" అని ఇచ్చినట్లే ముద్ర పడిపోయింది. ఆలాగే రాసి పంపాను. నా పొరపాటును సహృదయంతో మన్నిస్తారని ఆషిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. మళ్ళీ పొరపాటు... "అధ్యక్ష్యము" అనాల్సింది "అధ్యక్షము" అన్నాను. అసలుతో పాటు ఈ కొసరును కూడ క్షమించండి.

    రిప్లయితొలగించండి
  3. shankaraiah gaaru!
    ayyayyo! "manninchadam , kshaminchadam " vanti pedda maata lendukandi? meeru , hari gaaru iddaroo alaage maarci, poorana chesesariki anumaanam vachchi alaa vraasaanu. bhaashaku sambandhinchina charcha valana bhaashaa parigyaanam manam penchukovadame kaakundaa aasakti gala maro 10 mandiki penchina vaaramavutamani tappa , indulo anya bhaavana ledu. bhaasha pai meeku gala mamakaaraaniki naa johaarlu!

    రిప్లయితొలగించండి
  4. * డా || ఆచార్య ఫణీంద్ర గారు, నమస్సులు. మరికొంత అభ్యాసం వుంటేనే తప్ప ధైర్యంగా ఛందోబద్దమైన పద్య కవిత వెలికిరాదేమోనండి. మీ తరగతిలో ఈ మొద్దు విధ్యార్థిని కాస్త చూసీచూడనట్లుగా వదిలేయండి. టపాలు క్రమంగా చదువుతున్నాను. మననం చేసుకుంటున్నాను. మరికొంత సమయం కావాలి.

    రిప్లయితొలగించండి