'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :
"కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే!"
ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 జూన్ 2009
- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)
సమస్య: కసభాధ్యక్షతను పొందె కాంతామణియే.
రిప్లయితొలగించండి1) కం. అసదృశ వైదుష్యముతో
నెసఁగెడి మీరాకుమారి కిచ్చిరి యభిమా
న సదస్యామోదము; లో
క సభాధ్యక్షతను పొందె కాంతామణియే.
2) కం. విసమైనను నమృతముగా
వెస మార్చుచు వంటఁ జేసి వేవుర మెప్పిం
చి సరిగ నల భీముల పా
క సభాధ్యక్షతను పొందె కాంతామణియే.
అసమర్థు లాడు వాండ్రని
రిప్లయితొలగించండినసిగెడు వారెల్ల రింక నచ్చెరు వందే
దెస సోనియ ’ప్రతిభ’ను లో
క సభాధ్యక్షతను పొందె కాంతామణియే.
Shankarayya gaaru !
రిప్లయితొలగించండిmee kalaaniki rendu vaipulaa padune ...
meeru savyasaachi !
హరి గారు !
రిప్లయితొలగించండిబాగుంది. అభినందనలు !