2, మార్చి 2009, సోమవారం

ఈ మాసం పద్య కవిత (మార్చి 2009)

“శివాత్మకమ్”

shivatmakam

తెలుగు ప్రజలంతా తెలుసుకోవలసిన విషయమేమిటంటే -

శివాంశయే “త్రిలింగ” భాషగా రూపుదిద్దుకొన్నది.
శివాత్మకమైనది మన తెలుగు భాష!

“శివాత్మకమ్”
—————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
——————————–

నెలవంక రూపమే ’తలకట్టు’గా వెల్గె -
శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె -
మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై నిల్చె -
’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి -
’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ -
’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ -
’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె -
ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె -

అక్షరములౌ ఘన శివ లింగాకృతులయె
అక్షరంబులుగా ’త్రిలింగావని’పయి -
చెలువముగ నలరారుచున్ వెలుగ లిపిని,
వరలగ ’త్రిలింగ భాష’యై తరతరాలు!

*** నిజానికి ఇది పద్య కవులైన పాఠకులు పంపే పద్య కవితలను ప్రచురించే శీర్షిక. ఈ మాసానికి ఏ కవితా అందక పోవడం వలన సంపాదకుని పద్య కవితనే ప్రచురించ వలసి వచ్చింది. ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు దయచేసి కొత్త విషయాలపై వ్రాసిన తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు. కొలది పాటి తప్పులున్నా సరిదిద్ది ప్రచురించగలను. పద్య కవులను ప్రోత్సహించి, పద్య కవితా వ్యాప్తికి చేసే ప్రయత్నానికి సహకరించ ప్రార్థన.

- డా.ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు )

5 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. డా//పణీంద్రగారూ!
    పద్యం బాగుందండీ. దీనిలో ప్రతిపాదించిన విషయానికంటే,వర్ణించిన తీరు నాకు బాగా నచ్చింది.
    మీ
    దార్ల

    రిప్లయితొలగించండి
  3. దార్ల గారికి కృతజ్ఞతలు.
    మీ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ విద్యార్థులలో ఔత్సాహికులైన పద్య కవులుంటే, వారి పద్య కవితలను నాకు ఈ-మెయిల్ చేయమని చెప్పండి. ఈ బ్లాగు ద్వారా వారికి ప్రచారం కల్పించగలను. దళితవాద పద్య కవితలకు ప్రాధాన్యత ఈయగలను. జాషువ, జ్ఞానానంద కవుల వారసులను తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది.
    మరొకమారు కృతజ్ఞతలతో -
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  4. Your style of narration sketches beautiful paintings with words on influential minds.

    మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై నిల్చె - I just love that image you created.

    Thank you for a wonderful post.

    రిప్లయితొలగించండి